బ్లూబెర్రీతో గర్భాశయ కేన్సర్‌ చికిత్స...

     Written by : smtv Desk | Sun, Dec 31, 2017, 05:22 PM

బ్లూబెర్రీతో గర్భాశయ కేన్సర్‌ చికిత్స...

న్యూయార్క్‌, డిసెంబర్ 31 : పొత్తికడుపు కింది భాగంలోని గర్భాశయంలో కేన్సర్ సంభవిస్తుంది. అయితే, గర్భాశయం పైభాగాన్ని ఎండోసర్విక్స్ అంటారు. ఇది గ్రంథుల్లాంటి కణాలను కలిగి ఉంటుంది. గర్భాశయం కింది భాగాన్ని ఎక్టోసర్విక్స్ అంటారు. ఇది పొలుసులతో కప్పి ఉన్న కణాలను కలిగి ఉంటుంది. ఈ రెండు రకాల కణాలు (గ్రంథుల్లాంటి మరియు పొలుసులతో కప్పి ఉన్న కణాలు) కలిసే ప్రదేశం మార్పులకు అనుకూలంగా ఉంటుంది. ఎక్టోసెర్విక్స్‌లో పొలుసులతో కప్పి ఉన్న కణాల నుండి ఏర్పడే పొలుసులతో కప్పి ఉండే కణాల కార్సినోమాను (10 మందిలో 9 మందికి) సర్వసాధారణంగా సంభవించే గర్భాశయ కేన్సర్‌గా చెప్పవచ్చు.

అయితే, ఈ గర్భాశయ కేన్సర్‌ నివారణ కోసం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీ శాస్త్రవేత్తలు రేడియేషన్‌ చికిత్సకు కేన్సర్‌ కణాలు బాగా స్పందించేలా బ్లూబెర్రీలు ఉపయోగపడుతాయని తెలిపారు. బ్లూబెర్రీల సారం రేడియోసెన్సిటైజర్లలా వ్యవహరిస్తాయని, హానికరం కాని ఈ రసాయనం, కేన్సర్‌ కణాలు రేడియేషన్‌ చికిత్సకు స్పందించేలా చేస్తాయని వెల్లడించారు. బ్లూబెర్రీలలో రెస్వెట్రాల్‌(ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అడ్డుకునే రేడియోసెన్సిటైజర్‌), ఫ్లెవొనాయిడ్స్‌ అనే రసాయనాలు ఉంటాయని, అందులో ఫ్లెవొనాయిడ్స్‌ ప్రతిక్షకారినిలా, శోథ నిరోధకంగా పనిచేస్తుందని వివరించారు.

Untitled Document
Advertisements