స్ట్రెస్ వల్ల స్కిన్ పాడవుతుందట!

     Written by : smtv Desk | Thu, Mar 17, 2022, 01:46 PM

స్ట్రెస్ వల్ల స్కిన్ పాడవుతుందట!

స్ట్రెస్ ఇది స్కిన్‌కి అంత మంచిది కాదు. స్కిన్ కూడా ఒక అవయవమే కాబట్టి దానికి కూడా స్ట్రెస్ ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఎలాంటి శరీరకం, మానసిక, వాతావరణ ఒత్తిడి వల్లనైనా శరీరం కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. కార్టిసాల్ ఎక్కువైతే హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ జరుగుతుంది, ఫలితంగా చర్మ కణాల వద్ద ఇంఫ్లమేషన్ పెరిగి స్కిన్ ఆయిలీగా తయారవడం, బ్రేకౌట్స్ రావడం, స్కిన్ రిపెయిర్ త్వరగా జరగకపోవడం, ఎర్రగా మారడం, ఫ్లషింగ్, దురద, స్కిన్ అలసిపోయినట్లుగా కనిపించడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. అలాగని, మనమేమీ ఒత్తిడి లేకుండా జీవించలేం కదా, ప్రస్తుత కాలంలో ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగమయిపోయింది. మనం చేయగలిగినదల్లా ఆ ఒత్తిడిని ఎలా మ్యానేజ్ చేసుకోగలమా అనే. అలా ఒత్తిడి మ్యానేజ్ చేసుకుని స్కిన్‌ని హెల్దీగా, గ్లోయింగ్‌గా ఉంచుకోవడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి, చూసేయండి మరి..
ఒత్తిడికి దూరంగా ఉండడానికి..
1. మీరు దేని వల్ల ఒత్తిడికి గురువుతున్నారో గమనించండి.
2. మీరు ఇష్టపడే వారితో, మిమ్మల్ని అర్దం చేసుకునే వారితో మాట్లాడండి.
3. రోజూ ధ్యానం చేయండి.
4. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి.
5. పోషకాలతో నిండి ఉన్న బ్యాలన్స్డ్ డైట్ తీసుకోండి.
6. సరైన సమయంలో తగినంత సేపు నిద్రపోండి.
7. అధిక బరువు ఉంటే తగ్గించుకోండి.
8. అవసరమితే వైద్య సహాయం తీసుకోండి.
9. మీ స్కిన్ యొక్క అవసరాలకి తగినట్లుగా ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫార్మ్ చేసుకుని, ఆ రొటీన్‌ని ఫాలో అవ్వండి.
10. రోజుకి రెండు సార్లు క్లెన్సర్, మాయిశ్చరైజర్ వాడండి.
11. ఎస్‌పీఎఫ్ 30 కంటే ఎక్కువగా ఉన్న బ్రాడ్ స్పెక్ట్రం సన్ స్క్రీన్‌ని మూడు నాలుగు గంటలకి ఒకసారి అప్లై చేయండి.
12. అవసరాన్ని బట్టి రెటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ వంటివి మీ రొటీన్‌లో యాడ్ చేసుకోండి.
13. రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం అనేది అన్నింటికన్నా ఇంపార్టెంట్ అని మర్చిపోకండి.

అలాగే
* యూవీ రేస్, పొల్యూషన్, పొగ వంటివి స్కిన్ టిష్యూని డ్యామేజ్ చేయవచ్చు.
* సరైన సన్ ప్రొటెక్షన్ తప్పనిసరి.
* నియాసినమైడ్, విటమిన్ సీ, విటమిన్ ఈ వంటివి మీ రొటీన్‌లో ఉండడం హెల్ప్ చేస్తుంది.
* వేడి వేడి నీటితో స్నానం చేయకండి. గోరు వెచ్చని నీరే మంచిది.
* స్క్రబ్స్, లూఫాలు మరీ ఎక్కువగా వాడకండి.
* రోజుకి మూడు నాలుగు సార్లు మాయిశ్చరైజ్ చేసుకోండి.
* మీ మాయిశ్చరైజర్‌లో బారియెర్ రిపెయిరింగ్ ఇంగ్రీడియెంట్స్ అయిన హయలురానిక్ యాసిడ్, సెరామైడ్స్, గ్లిసరిన్, విటమిన్ ఈ వంటివి ఉండేలా చూసుకోండి.
* సన్ స్క్రీన్‌ని యూజ్ చేయడం మరిచిపోకండి.
* మేకప్ అప్లికేటర్స్‌ని రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉండండి.
* రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ రిమూవ్ చేసే పడుకోండి.
* పాలు, పంచదార, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తగ్గించండి.
* కంపల్సరీగా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అప్లై చేయండి.
* సాల్ట్ తగ్గించండి.
* ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి.
* మాటిమాటికీ కళ్ళు నులమకండి.
* తగినంత సేపు నిద్రపోండి.
* స్క్రీన్ టైం తగ్గించండి.
* కెఫీన్, విటమిన్ కే1, కోజిక్ యాసిడ్, పెప్టైడ్స్, రెటినాల్స్, విటమిన్ సీ, హయలురానిక్ యాసిడ్ వంటివి ఉన్న ప్రోడక్ట్స్ హెల్ప్ చేయవచ్చు.
* సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ మర్చిపోకండి.
* స్కిన్ ని ఎప్పుడూ మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుకోండి.
* తగినంత సేపు నిద్రపోండి.





Untitled Document
Advertisements