ఎస్‌బీఐ రుణ గ్రహీతలకు శుభవార్త..

     Written by : smtv Desk | Mon, Jan 01, 2018, 05:18 PM

ఎస్‌బీఐ రుణ గ్రహీతలకు శుభవార్త..

న్యూఢిల్లీ, జనవరి 1 : బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు, రుణ గ్రహీతలకు నూతన సంవత్సర కానుక అందించింది. రుణాలపై వడ్డీ రేటును 30 బేస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రేట్లు నేటి నుండి అమలులోకి రానున్నట్లు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కాని 2016 ఏప్రిల్‌కు ముందు బేస్‌ రేట్‌ ఆధారంగా రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది అనేది నిబంధన. ప్రస్తుతం 8.95 శాతంగా ఉన్న వడ్డీరేటు 8.65 శాతానికి తగ్గనుంది.





Untitled Document
Advertisements