నా పుట్టినరోజు నాడు మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.. సామ్

     Written by : smtv Desk | Fri, Apr 29, 2022, 11:42 AM

నా పుట్టినరోజు నాడు మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.. సామ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏంమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా తన అందం అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆ తరువాత నాగచైతన్యను వివాహం చేసుకుని తెలుగింటి కోడలిగా మారింది. కొంతకాలం అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్యంలో ఎలాంటి కలతలు ఏర్పాడ్డాయో తెలియదు గాని గత సంవత్సరం అక్టోబర్ లో వీరిరువు విడాకుల పేరుతో విడిపోయారు. అయితే సమంతా తాజాగా తన 35వ పుట్టిన రోజు వేడుకను జరుపుకుంది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ సమంత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సోషల్ మీడియాలో భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టింది. నిన్న సామ్ 35వ పుట్టినరోజును జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు హీరోలు, హీరోయిన్లు, ఆమె స్నేహితులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.
దీంతో ఆమె వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టింది. ‘‘నా పుట్టినరోజు నాడు మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ ప్రోత్సహం, స్ఫూర్తి, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరంతా నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు’’ అని సమంత పేర్కొంది. అంతేకాదు.. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారు పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్లను ఆమె పోస్ట్ చేసింది.





Untitled Document
Advertisements