ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమైన 'సర్కారివారి పాట' !

     Written by : smtv Desk | Thu, May 05, 2022, 11:49 AM

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమైన 'సర్కారివారి పాట' !

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేశ్ జంటగా 'సర్కారువారి పాట' చిత్రం రూపొందింది. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, పరశురామ్ డైరెక్షన్ వస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. లవ్ .. యాక్షన్ .. కామెడీ ప్రధానంగా నడిచే ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన రిలీజ్ అవుతుంది.
చిత్రం విడుదల నేపధ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోందట. ఈ నెల 7న మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టుగా సమాచారం. వేదికను ఖరారు చేయడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. ఇక ఎనౌన్స్ మెంట్ వదలడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా 'గోవా'లో షుట్ చేసిన ఇంటర్వెల్ బ్యాంగ్ కి థియేటర్స్ లో విజిల్స్ పడతాయని చెబుతున్నారు. హ్యాట్రిక్ హిట్ తరువాత మహేశ్ చేస్తున్న ఈ చిత్రం ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటుందనేది చూడాలి.





Untitled Document
Advertisements