ఏఆర్ రెహమాన్ కుమార్తె పెళ్లి ఫొటోలు..

     Written by : smtv Desk | Fri, May 06, 2022, 11:53 AM

 ఏఆర్ రెహమాన్ కుమార్తె పెళ్లి ఫొటోలు..

సంగీత దర్శకుడు ఏఆర్ రెహ‌మాన్ సంగీత ప్రపంచంలో ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రెహమాన్ కూతురు ఖతీజా వివాహం జరిగింది.
సినీ రంగంలో లైవ్ సౌండ్ ఇంజనీర్ గా ప‌నిచేస్తోన్న రియాస్ దీన్ షేక్ మొహ‌మ్మ‌ద్ తో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహ్మాన్‌ నిశ్చితార్థం గ‌త ఏడాది డిసెంబరు 29న ఘనంగా జరిగిన విష‌యం తెలిసిందే. రియాస్, ఖ‌తీజాల వివాహం తాజాగా సింపుల్‌గా జ‌రిగింది.
పెళ్లి ఫొటోలను ఖతీజా సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. జీవితంలో ఇది ఎంతో సంతోష‌క‌రమైన‌ రోజ‌ని, త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న‌ట్లు ఖ‌తీజా త‌న ఇన్ స్టాగ్రామ్‌ పోస్టులో రాసింది. ఏఆర్ రెహ‌మాన్ కూడా ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేస్తూ ఈ జంట‌ను భ‌గ‌వంతుడు దీవించాల‌ని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements