కీర్తి సురేష్ "చిన్ని " చిత్రం విడుదల..

     Written by : smtv Desk | Fri, May 06, 2022, 03:49 PM

కీర్తి సురేష్

మహానటి చిత్రంతో తెలుగులో అందరినీ ఆకట్టుకున్న కీర్తి సురేష్ నటించిన. ''చిన్ని '' చిత్రం విడుదల అయ్యింది . ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే కీర్తి సురేష్ పాత్ర డీ గ్లామ‌ర్‌గా.. డిఫ‌రెంట్‌గా అనిపించింది. ఈ సినిమాను తెలుగులో ‘చిన్ని’ పేరుతో అనువాదం చేశారు. ఇది వ‌ర‌కు కీర్తి సురేష్ చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పెంగ్విన్‌, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో డైరెక్ట్‌గా విడుద‌ల‌య్యాయి. ద‌ర్శ‌కుడు అరుణ్ మాదేశ్వ‌ర‌న్ సినిమాలో నేచురాలిటీ ఉండాల‌ని క‌థ‌ను న‌డిపించిన తీరు సాగ‌దీత‌గా అనిపించింది. చిన్ని సినిమా అంతా 1989 బ్యాక్ డ్రాప్‌లోనే సాగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగే పోరు. ఓ వ్య‌క్తి కోపంతో చేసిన ప‌ని .. ఓ వ‌ర్గానికి చెందిన పెద్ద‌ల‌కు తారాస్థాయిలో కోపాన్ని తెప్పిస్తుంది. వారు ఆ వ్య‌క్తి కుటుంబంపై ప‌గ తీర్చుకుంటారు. దానికి భ‌ర్త స‌హా బిడ్డ‌ను కోల్పోయిన మ‌హిళ ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంద‌నేదే క‌థాంశం.గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో పాటు లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ వ‌చ్చింది. కానీ మహానటి తెచ్చినంత గుర్తింపు మరో సినిమా తెచ్చి పెట్టలేకపోయింది. ఈ క్ర‌మంలో కీర్తి సురేష్ న‌టించిన ‘సాని కాయిదం’ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. డైరెక్ట్ గా పోటీ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందనేది వేచి చూడాలి. అయితే ఈ సినిమా మాత్రం కీర్తి సురేష్ గ్లామర్కి పూర్తి డిఫరెంట్ గా నటించింది.





Untitled Document
Advertisements