మహేష్ సినిమాకు టికెట్ల రేట్ల పెంపుకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్

     Written by : smtv Desk | Sat, May 07, 2022, 11:53 AM

మహేష్ సినిమాకు టికెట్ల రేట్ల పెంపుకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్

అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్ తో రూపొంది సర్కారు వారి పాట చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న సినిమా కు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సినిమాలకు మొదటి వారం రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతులు ఇచ్చిన విషయం తెల్సిందే.
మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రానికి వంద కోట్లకు పైగా ఖర్చు అయ్యిందని అందుకే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లను పెంచేందుకు ఓకే చెప్పారు. పైగా ఆ మద్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన చిత్రపరిశ్రమ టీమ్ లో మహేష్ బాబు కూడా ఉన్న విషయం తెల్సిందే. అందుకే మహేష్ బాబు చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఓకే చెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో మహేష్ తాజా చిత్రం సర్కార్ వారి పాట చిత్రం భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. చిత్రం పై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేసేందుకు గాను మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేశారు. 10 రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచడం వల్ల భారీ మొత్తంలో ఈ సినిమా వసూళ్లు చేసే అవకాశం ఉందని.. మొదటి వారం రోజుల్లో ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఏపీ సర్కార్ నుండి జీవో విడుదల అవ్వడంతో త్వరలోనే తెలంగాణలో కూడా సర్కార్ వారి పాట చిత్రానికి టికెట్ల పెరుగుదలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ నటించిన విషయం తెల్సిందే. మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ల కాంబో పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు మూవీపై అంచనాలు పెంచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై మరింతగా అంచనాలు పెంచాయి. రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం ద్వారా భారీ ఓపెనింగ్స్ పై చిత్రబృందం కన్నేశారని తెలుస్తోంది.
సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ బాబు బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలు మరియు అవినీతి నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉండబోతుందట. చిత్రంలో మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ పోకిరి మరియు దూకుడు చిత్రాలను గుర్తు చేస్తున్నాయి. దాంతో ఖచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అనే నమ్మకంతో మహేష్ బాబు అభిమానులు ఉన్నారు.





Untitled Document
Advertisements