షారుక్‌ ఖాన్‌-అజయ్‌ దేవగన్‌ మధ్య విభేదాలు.. స్పందించిన అజయ్‌ దేవగన్‌

     Written by : smtv Desk | Thu, May 12, 2022, 09:54 AM

షారుక్‌ ఖాన్‌-అజయ్‌ దేవగన్‌ మధ్య విభేదాలు.. స్పందించిన అజయ్‌ దేవగన్‌

ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలెబ్రిటీల మధ్య లవ్, ఎఫైర్, పెళ్లి, గొడవలు అంటూ ఎప్పుడు ఎదో ఒక వార్త స్ప్రెడ్ అవడం సాధారణమే అయినా కొన్ని సందర్భాల్లో రూమర్స్ నిజం అవ్వొచ్చు, కొన్ని సార్లు అబద్దం కూడా కావచ్చు. ఇప్పుడు ఇదంతా దేనికి అనుకుంటున్నారా.. బాలీవుడ్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది దాని గురించే ఇదంతా.. విషయం ఏమిటి అంటే..
బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌-అజయ్‌ దేవగన్‌ మధ్య విభేదాలు ఉన్నట్లు బాలీవుడ్‌ టాక్‌. ఓ పార్టీలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని, అప్పటి నుంచి ఈ ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య మాటల్లేవని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది అనే వార్తలపై అజయ్‌ దేవగన్‌ మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. అసలు వారి మధ్య ఎలాంటి గొడవ జరగలేదన్నారు.
ఆయన మాట్లాడుతూ..'నేను, సల్మాన్‌, ఆమిర్‌ ఖాన్‌, షారుక్‌ ఇలా ఓ అరడజను హీరోలు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఒకటీ రెండేళ్లలోనే మేమంతా స్నేహితులుగా మారిపోయాం. మా మధ్య సినిమాల విషయంలో పోటీ ఉంటుంది తప్పా వ్యక్తిగతంలో మా మధ్య గొడవలు లేవు. ఇక షారుక్‌తో విభేదాలు అన్నవి కూడా పూర్తి అబద్దం. ఇది ఎవరో సృష్టించిన పుకార్లు మాత్రమే అంటూ దేవగన్‌ వివరించారు.





Untitled Document
Advertisements