రాజస్తాన్ పై విజయంతో ఢిల్లీ కి ప్లే ఆప్స్ కి ఆశలు సజీవం ..

     Written by : smtv Desk | Thu, May 12, 2022, 10:40 AM

రాజస్తాన్ పై విజయంతో ఢిల్లీ కి ప్లే ఆప్స్ కి ఆశలు సజీవం ..

ఐపిఎల్ 2022 సీజన్లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌కు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ కు ముంబయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ విధ్వంసక ఇన్నింగ్స్ తో చేజింగ్లో ఢిల్లీ కి సునాయాసంగా విజయాన్ని అందించాడు. టాస్ గెలిచినా ఢిల్లీ కాపిటల్స్ బౌలింగ్ ను ఎంచుకోగా రాజస్తాన్ జట్టు బాటింగ్ కి వచ్చింది. రాజస్తాన్ జట్టు బ్యాటర్లలో ఓపెనర్లు యశశ్వి జైశ్వాల్ 19 , జోస్ బట్లర్ 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా వన్ డౌన్ గా వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసాడు. రియన్ పరాగ్ కేవలం 9 పరుగులకే పెవిలియన్ బాట చేరుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, దేవదత్ పడిక్కల్ మినహా మిగతా ఆటగాళ్లెవరూ రాణించలేదు. అశ్విన్ 38 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేసి అవుటవ్వగా.. పడిక్కల్ 30 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. వాన్ డర్ డసన్ 10 బంతుల్లో 12, బౌల్ట్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఢిల్లీ జట్టు మొదట్లోనే ఓపెనర్ శ్రీకర్ భరత్ రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరగగా మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిలకడగా వికేట్ ని కాపాడుకుంటూ ఆడి 52 పరుగులు చేయగా , వన్ డౌన్ బాట్స్మెన్ గా వచ్చిన మిచెల్ మార్ష్ మొదటి నుండే దూకుడు ఆటని ప్రదర్శిస్తూ 89 పరుగులను కేవలం 62 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఈ పరుగులను చేసి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ 4 బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు . 18.1 ఓవర్‌లోనే 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. అయితే ఈ విజయంతో ఢిల్లీ జట్టుకు ప్లే ఆప్స్ కి ఆశలు సజీవం అయ్యాయి .





Untitled Document
Advertisements