ముంబైకి మూడవ విజయం ..

     Written by : smtv Desk | Fri, May 13, 2022, 10:27 AM

ముంబైకి మూడవ విజయం ..

ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా గురువారం రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ల మద్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలుపొంది. ఈ సీజన్లో రెండు జట్ల మద్య పోరును సమం చేసింది. టాస్ ఓడిన చెన్నై జట్టు బ్యాటింగ్ కి రాగా ఓపెనర్లు దేవాన్ కాన్వె (0), రుతురాజ్ గైక్వాడ్ (7)లతో పాటు మొయిన్ అలీ (0)నీ ముంబయి పేసర్ డేనియల్ శామ్స్ వరుసగా పెవిలియన్‌కి చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప (1), అంబటి రాయుడు (10) కూడా తేలిపోగా.. శివమ్ దూబె (10) కూడా క్రీజులో నిలవలేకపోయాడు. కానీ.. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 36 నాటౌట్ ఆఖరి వరకూ క్రీజులో నిలిచినా ఎవరు తోడుగా నిలబడలేదు . అల్ రౌండర్ బ్రావో (12) పరుగులతోనే సరిపెట్టుకున్నాడు.సమర్‌జీత్ (2), థీక్షణ (0), ముకేష్ చౌదరి (4) కాసేపు కూడా క్రీజులో ఉండలేకపోయారు. దీంతో చెన్నై జట్టు 16 ఓవర్లలోనే 97 పరుగులకి ఆలౌట్ అయ్యింది . ముంబయి బౌలర్లలో డేనియల్ శామ్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మెరాడిత్, కార్తికేయ చెరో రెండు, బుమ్రా, రమణదీప్ తలో వికెట్ తీశారు. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ ఇషాన్ కిషన్ (6), డేనియల్ శామ్స్ (1),అరంగేట్రం చేసిన ప్లేయర్ స్టబ్స్ (0) , లు సింగల్ డిజిట్ స్కోరులకే పరిమితం అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (18) పరుగులు మాత్రమే చేయగా ఈ దశలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (34 నాటౌట్: 32 బంతుల్లో 4x4) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా అతనికి మరో బ్యాటర్ హృతిక్ (18) మంచి సపోర్ట్ అందించాడు. అయితే.. టీమ్ స్కోరు 81 వద్ద హృతిక్ ఔటైపోవడంతో క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ 16 రెండు సిక్సర్లు బాది మ్యాచ్ ని ముగించేసాడు. ముంబై ఈ మ్యాచ్ గెలుపుతో ముంబై మూడవ విజయాన్ని సొంతం చేసుకోగా ..చెన్నై కి మాత్రం ప్లే ఆప్స్ ఆశలపై ముంబై నీళ్ళు చల్లింది.





Untitled Document
Advertisements