కే ఎల్ రాహుల్ అతియా శెట్టి ల ప్రేమ వ్యవహారం పై స్పందించిన సునీల్ శెట్టి ..

     Written by : smtv Desk | Fri, May 13, 2022, 11:36 AM

కే ఎల్ రాహుల్ అతియా శెట్టి ల ప్రేమ వ్యవహారం పై స్పందించిన సునీల్ శెట్టి ..

భారత ప్రముఖ క్రికెటర్ కే ఎల్ రాహుల్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి ప్రేమ వ్యవహారం పెళ్ళిపీటలెక్కనుందటా.. అతియా శెట్టి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ని కలిగి ఉంది. ఇక తన ప్రియుడు అయిన క్రికెటర్ కే ఎల్ రాహుల్ తో జోడిగా షికార్లు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తుంటే దాంతోనూ బోలెడంత ఫాలోయింగ్ పెరిగింది. ఈ అందాల నాయిక తరచుగా ఇన్ స్టాగ్రమ్ లో తన ఆకర్షణీయమైన రూపాన్ని షేర్ చేస్తూనే ఉంది. ఆమె ప్రియమైన వారిని అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. ఈసారి కూడా అతియా ఇన్ స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అభిమానులు లైక్ మరియు షేర్ లతో వైరల్ గా మారాయి . కేవలం కొన్ని గంటలలో అథియా `గ్రామ్`లో కొన్ని అందమైన స్నాప్ లను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. తన ఫోటోలకు ప్రియుడు కె.ఎల్.రాహుల్ కూడా వెంటనే స్పందించాడు.ఆతియా ఫోటోలను పోస్ట్ చేసిన వెంటనే ప్రియుడు క్రికెటర్ కెఎల్ రాహుల్ దానిపై స్పందించి ఆమె ఫోటోను లైక్ చేశారు. అతనితో పాటు సునీల్ శెట్టి - రిద్ధిమా కపూర్ సాహ్ని- కరిష్మా కపూర్ - కియారా అద్వానీ తదితరులు కూడా ఆ ఫోటోలకు లైక్ కొట్టారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. సునీల్ శెట్టిని తన కుమార్తె వివాహంపై పుకార్ల గురించి అడగగా .. దీనిపై స్పందించిన సునీల్ శెట్టి “కాలం మారినందున వారు ఏమి చేయాలనుకుంటున్నారో వారు నిర్ణయించుకుంటారు. నా కుమార్తె మరియు కొడుకు ఇద్దరూ బాధ్యతగల వ్యక్తులు.. వారు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, అంతేకాక వారి పెండ్లిలు ఎంత తొందరగా జరిగితే అంత తనకు రిలాక్సింగ్ గా ఉంటుందని ” అన్నారు. ఈ వ్యాఖ్యలతో రాహుల్ అతియాల పెళ్లి తొందరలోనే జరగనున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి.





Untitled Document
Advertisements