ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు చీఫ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ దిగ్గజం ..

     Written by : smtv Desk | Fri, May 13, 2022, 02:55 PM

ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు చీఫ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ దిగ్గజం ..

క్రికెట్ ఆటకి పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ టీం కి నూతనంగా కోచ్ నియమితం అయ్యాడు. న్యూజిలాండ్ స్టార్ దిగ్గజ క్రికెటర్ ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్‌ మెకల్లమ్‌ ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు చీఫ్‌ కోచ్‌గా నియమితుడైనట్టు ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించింది. బ్రెండొన్ మెకల్లమ్ న్యూజిలాండ్ జట్టుకు సారథిగా అలాగే కీలక బాట్స్మెన్ గా ఎన్నో విజయాలను అందించాడు. అంతేకాక జట్టు ఎన్నో విజయాలలో ముందుకు నడిపించి ఎందరో యువ ఆటగాళ్లకి ఐకాన్ గా మారాడు. అయితే బ్రెండన్‌ మెకల్లమ్‌ భారత ప్రిమియర్ లీగ్ లో చెన్నై జట్టు కు కీలక బాట్స్మెన్ గా వ్యవహరించాడు. చెన్నై జట్టుకు ఎన్నో విజయాలను అందించిన బ్రెండన్‌ మెకల్లమ్‌ 2019లో క్రికెట్‌కు వీడ్కోలు వరల్డ్ కప్ అనంతరం ప్రపంచ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు . అయితే 40 ఏళ్ల మెకల్లమ్‌ ఇంగ్లాండ్ జట్టుకు టెస్ట్‌ జట్టు చీఫ్‌ కోచ్‌గా నియమితం అయ్యిన మొదటగా తన సొంత దేశం అయినా న్యూజిలాండ్ తోనే మొదటగా ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ తో మెకల్లమ్ గట్టి పరీక్షనే ఎదుర్కొననున్నాడు.






Untitled Document
Advertisements