బెంగళూరుని బాదిన పంజాబ్ బ్యాట్టేర్లు ..ప్లే ఆప్స్ రేసులో పంజాబ్

     Written by : smtv Desk | Sat, May 14, 2022, 03:43 PM

బెంగళూరుని బాదిన పంజాబ్ బ్యాట్టేర్లు ..ప్లే ఆప్స్ రేసులో పంజాబ్

ఐపిఎల్ 2022 సీజన్లో భాగంగా ప్లే ఆప్స్ రేసులో పోటి పడుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం ఒకదానికొకటి తలపడగా బెంగళూరు జట్టు పై మొదటగా బాటింగ్ చేసిన పంజాబ్ జట్టు బ్యాట్టేర్లు పంజా విసరడంతో బెంగళూరు జట్టు లక్ష్యాన్ని చేదించలేక పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ జట్టు ఓపెనర్ జాని బెయిర్స్తో 66 పరుగులతో మొదటి నుండే బెంగళూరు బౌలర్లపై దాడిని ప్రారంభించాడు. మరో పవర్ హిట్టర్ లివింగ్స్టాన్ కూడా అదే రీతిలో రెచ్చిపోయాడు.కేవలం 42 బంతుల్లో 70 పరుగులు చేసాడు.వీరిద్దరి ఆటతో పంజాబ్ జట్టు 210 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు ముందుంచింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు మరియు హేజిల్వుడ్ నాలుగు ఓవర్లలోనే 100 పరుగులు ఇవ్వడం పంజాబ్ కి కలిసొచ్చింది. బెంగళూరు బౌలర్లలో హర్స్హళ్ పటేల్ 4 , హసరంగా 2 వికెట్లు తీసుకున్నారు.రెండవ ఇన్నింగ్స్ ణి ప్రారంభించిన బెంగళూరు జట్టు అసలు ఎలాంటి పోటిని ఇవ్వకుండా బ్యాట్టేర్లందరూ తేలికగా వికెట్లు సమర్పించుకున్నారు.ఓపెనర్స్ కెప్టెన్ డుప్లెసిస్ (10), రజత్ పాటిదార్ (26), మహిపాల్ లూమర్ (6), దినేశ్ కార్తీక్ (11) ఫెయిలయ్యారు. కానీ.. కాసేపు క్రీజులో నిలిచిన గ్లెన్ మాక్స్‌వెల్ ( స్కోరు చేసినా.. టీమ్ స్కోరు 104 వద్ద అతనూ ఔటైపోయాడు. ఆ తర్వాత వచ్చిన షబాజ్ అహ్మద్ (9), వానిందు హసరంగ (1) కూడా తేలిపోయారు. బెంగళూరు బ్యాట్టేర్లు అందరు కలిపి కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు తీయగా.. రిషి ధావన్, రాహుల్ చాహర్ చెరో రెండు, హర్‌ప్రీత్, అర్షదీప్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో కూడా బెంగళూరు జట్టు ఇంకా ప్లే ఆప్స్ రేసులో ఉండటం విశేషం .అయితే బెంగళూరు తర్వాత మిగిలున్న అన్ని మ్యాచ్ లలో గెలవాల్సి ఉంది .





Untitled Document
Advertisements