రబడ నయా రికార్డు ..

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 12:56 PM

రబడ నయా రికార్డు ..

ఐపిఎల్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా బౌలర్ కగిసో రబడ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు . ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న డేల్ స్టిన్ ను వెనక్కి నెట్టేశాడు. ఐపిఎల్ 2022 సీజన్లో భాగంగా సోమవారం రాత్రి డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్ కి మద్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు చేజింగ్లో ఏ మాత్రం నిలవలేకపోవడంతో పంజాబ్ జట్టు ఓటమి పాలయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది . ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. పంజాబ్ ఏడో ప్లేస్‌కే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టన్, అర్షదీప్ సింగ్ చెరో మూడు వికెట్లతో ఢిల్లీ బ్యాట్టేర్లను బోల్తా కొట్టించగా .. రబడ ఒక వికెట్ పడగొట్టాడు. అయితే ఈ ఒక్క వికెట్ తో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. 98 వికెట్లతో రబాడా దక్షిణాఫ్రికా బౌలర్లలో మొదటి స్థానానికి చేరాడు. 97 వికెట్లతో ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న డేల్ స్టిన్ ను వెనక్కి నెట్టేశాడు. మిశ్చెల్ మార్ష్ వికెట్ తీయడంతో ఈ ఘనత సొంతమైంది. సోమవారం మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది. మిశ్చెల్ మార్ష్ వికెట్ తీయడంతో ఈ ఘనత సొంతమైంది. 97 వికెట్లతో ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న డేల్ స్టిన్ ను వెనక్కి నెట్టేశాడు.





Untitled Document
Advertisements