తిలక్ వర్మ పై గవాస్కర్ ప్రశంసల వర్షం ..

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 02:22 PM

తిలక్ వర్మ పై గవాస్కర్ ప్రశంసల వర్షం ..

ఈసారి ఐపిఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న హైదరాబాది ప్లేయర్ యువ క్రికెటర్ తిలక్ వర్మ పైన టీమిండియా క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంశలు కురిపించాడు. తిలక్ వర్మకు టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడగలిగే కేపబులిటి ఉందని ఆయన స్పష్టం చేసారు . అంతేకాక తిలక్ వర్మ వయస్సులో చిన్నవాడైనప్పటికీ చాలా పరిణతితో ఆడుతున్నాడు. సాంకేతికంగా అతడిలో తప్పు పట్టడానికి ఏమీ లేదు. స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ సింగిల్స్‌తో పాటు భారీ షాట్లు కూడా ఆడగల నైపుణ్యం ఉంది. దీంతో అతడికి క్రికెట్‌ పరిజ్ఞానం ఎక్కువే అని తెలుస్తోంది. ఫిట్‌నె్‌సను కాపాడుకుంటే భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడగలడు’ అని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు. కేవలం గవాస్కర్ మాత్రమే కాక ఇటివల ముంబై ఇండియాన్స్ జట్టు కెప్టెన్ ‌ రోహిత్‌ శర్మ కూడా తిలక్ వర్మ ఆటను గురించి అభిప్రాయం వ్యక్తం చేస్తూ '' తిలక్ వర్మ కు చాలా టాలెంట్ ఉంది అతను టీంఇండియాకు సరిపడే ప్లేయర్ అని ప్రశంసల వర్షం కూడా కురిపించాడు''. తిలక్ వర్మ ఈసారి ముంబై ఇండియాన్స్ జట్టులో వన్ డౌన్ బాట్స్మెన్ గా కీలక భాద్యతలు తీసుకుంటున్నాడు. మొదటి రెండు మూడు మ్యాచ్ లలో చాలా చక్కటి షాట్స్ ప్రేక్షకులను మరింతగా అలరించాడు.





Untitled Document
Advertisements