బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్..

     Written by : smtv Desk | Thu, Jan 04, 2018, 11:21 AM

బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్..

న్యూఢిల్లీ, జనవరి 4 : జియో...ప్రస్తుత భారత్ టెలికాం మార్కెట్ లో సామాన్య ప్రజలందరికి డేటా, వాయిస్ ను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చి మిగతా టెలికాం సంస్థలకు గట్టి పోటీనిస్తుంది. జియో దెబ్బకు మిగతా కంపెనీలు కూడా తమ వినియోగాదారులను నిలుపుకోనేందుకు వరుసుగా ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ జియో కు ధీటుగా ఓ కొత్త ఆఫర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగాదారులు రూ.187తో రీఛార్జ్‌ చేసుకున్నట్లయితే 28 రోజుల పాటు అపరిమితంగా డేటా వాడుకోవచ్చు. ఇతర నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, నేషనల్‌ రోమింగ్‌ (ముంబయి, ఢిల్లీ మినహాయించి) ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా వినియోగదారులు తమకు నచ్చిన రింగ్‌టోన్‌ను పెట్టుకునేందుకు ‘పర్సనలైజ్డ్‌ రింగ్‌ బ్యాక్‌ టోన్‌’ పేరుతో ప్రత్యేక సదుపాయాన్ని కూడా ఈ పథకంలో కల్పించింది.

Untitled Document
Advertisements