తగ్గేదేలే అన్న బ్యాట్స్మెన్లు చివరి బంతికి లక్నో విజయం ..

     Written by : smtv Desk | Thu, May 19, 2022, 10:29 AM

తగ్గేదేలే అన్న బ్యాట్స్మెన్లు చివరి బంతికి లక్నో విజయం ..

ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్‌ బర్త్ కోసం గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 20 ఓవర్లలో 210 చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ లే ఇన్నింగ్స్ చివరి వరకు వికెట్ పడనివ్వకుండా ఆడడం విశేషం .
క్వింటన్ డికాక్ 140 పరుగులు కేవలం 70 బంతుల్లోనే చేసాడు అంటే ఎంత విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. డికాక్ కి తోడుగా కెప్టెన్ రాహుల్ హాఫ్ సెంచరీతో 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌథీ 57 పరుగులు వరుణ్ చక్రవర్తి 38, ఉమేశ్ యాదవ్ 34 రసెల్ మూడు ఓవర్లలో 45 పరుగులు సునీల్ నరైన్ ఒక్కడే 27 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం.
లక్నో నిర్దేశించిన భారీ టార్గెట్ 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 2 భారీ స్కోర్ ఛేదనలో ఏ మాత్రము తగ్గలేదు . ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, అభిజిత్ తోమర్ లు తొందరగానే పెవిలియన్ చేరుకున్నారు. ఐన కూడా జట్టు బాట్స్మెన్ లు అందరు బౌండరీలే లక్ష్యంగా బాటింగ్ చేసారు . తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌండరీలతో విరుచుకుపడి నితీష్ రాణా 22 బంతుల్లో 9 ఫోర్లు బాది 42 పరుగులు చేయగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆ తర్వాత బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి అవుటయ్యాడు. తర్వాత శామ్ బిల్లింగ్స్ 36 కొద్దిసేపు స్కోర్ బోర్డును పరిగెత్తించి బిష్ణోయ్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆల్ రౌండర్ ఆండ్రు రసెల్ 5 పరుగులే చేసి అంచనాలను తారుమారు చేసాడు. ఆఖర్లో రింకూ సింగ్, సునీల్ నరైన్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. చివరి ఓవర్‌లో జట్టు విజయానికి 21 పరుగులు కావాల్సి రావడంతో రింకూ సింగ్ 4, 6, 6, 2తో 18 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో మ్యాచ్ చేజారింది. రింకూ సింగ్ 40 పరుగులు 15 బంతుల్లో పూర్తి చేసాడు. మరోవైపు సునీల్ నరైన్ 21 పరుగులను 7 బంతుల్లోనే బాదడం విశేషం. చివరి బంతికి ఉమేశ్ డకౌట్ అవ్వడం తో కేకేఅర్ జట్టు రెండు పరుగులతో ఓటమి పాలయ్యింది. .20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి కేవలం రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లక్నో బౌలర్లలో మోషిన్ ఖాన్ 3 కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ తో లక్నో జట్టు ప్లే ఆప్స్ కి చేరుకోగా కేకేఆర్ జట్టు ఈ సీజన్లో ఇంటికి పయనమయ్యింది.






Untitled Document
Advertisements