''బాయ్ కాట్ ధక్కడ్ '' కంగనాకు షాక్..

     Written by : smtv Desk | Fri, May 20, 2022, 11:44 AM

''బాయ్ కాట్ ధక్కడ్ ''  కంగనాకు షాక్..

ఈరోజు అనగా మే 20 న కంగనా రనౌత్ నటించిన '' ధక్కాడ్ ''మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం కంగనా రనౌత్ చేసే వ్యాఖ్యలు ఆమె బెహేవియర్ కారణం అంటున్నారు . సుశాంత్ సింగ్ అభిమానులు మరింతగా విరుచుకుపడుతున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు పై మొట్టమొదటి వ్యక్తి కంగనా రనౌత్ . అయితే ఇప్పుడు ఈమె పైననే విమర్శలు చేయడం ఏంటా అని చూస్తే.. సుషంత్ సింగ్ మరణాన్ని కంగనా తన స్వీయ ప్రయోజనాల కోసం అతడి పేరును ఉపయోగించుకున్నారని ఆరోపిస్తున్నారు . సుశాంత్ కేస్ కో సబ్సే జాదా యూజ్ కరా హై అప్నే ఫయాదే కే లియే మతలబీ కహిన్ కీ .. అంటూ ట్వీట్లు కూడా పేలుతున్నాయి. అయితే ఈ మద్యన కంగన సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగా మెలగడం పట్లా ఈ విమర్శలు వస్తున్నాయి. ధాకడ్ ప్రమోషన్స్ కోసమేనా? ఎవరైనా ఇలా చేస్తారా? అంటూ నిలదీస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈమే బాలీవుడ్ లో స్టార్స్ అంతా కలిసి సుశాంత్ ను తొక్కేసే ప్రయత్నం చేసారని విమర్శించారు. కాని నేడు సల్మాన్ ఖాన్ తో ఇలా క్లోజ్ గా ఉండటం వాళ్ళ '' ధక్కాడ్ '' సినిమాను బహిష్కరించాలని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు కంగనా తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తు "బాయ్ కాట్ దక్కడ్" అంటూ ట్వీట్లు చేస్తున్నారు .





Untitled Document
Advertisements