ఆయన ఓటీటీ వర్షన్ బిగ్ బాస్ సీజన్ 2కు హోస్ట్ గా ఒకే చెప్తారా?

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 07:03 AM

ఆయన ఓటీటీ వర్షన్ బిగ్ బాస్ సీజన్ 2కు హోస్ట్ గా ఒకే చెప్తారా?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు మొదటి సీజన్ నుండి ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయిపోయారు. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించాడు. ఈ కారణంగానే బిగ్ బాస్ అనే షో జనాల్లోకి బాగా వెళ్ళింది. ఆ తరువాత వచ్చిన సీజన్ టూ నాని హోస్టింగ్ చేయడం వల్ల కాస్త షో విషయంలో విమర్శలు వచ్చాయి. ఇక అక్కడి నుండి వరుసగా మూడు.. నాలుగు.. అయిదు సీజన్ లకు హోస్ట్ గా నాగార్జున ఈ షోను తన చేతిలోకి తీసుకున్నాడు.
బిగ్ బాస్ అన్ని సీజన్ లు కూడా పర్వాలేదు అన్నట్లుగా మంచి రేటింగ్ తో పాటు నిర్వాహకులకు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. అందుకే హిందీలో చేసిన డిజిటల్ ప్రయోగంను తెలుగులో తీసుకు వచ్చారు. తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24/7 ఫార్మట్ అంటూ ప్రచారం చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం తెల్సిందే. చాలా మంది లైవ్ స్ట్రీమింగ్ పట్ల చాలా ఆసక్తిని కనబర్చారు.
జనాలు భావించినంత రక్తి కట్టించేలా లైవ్ స్ట్రీమింగ్ లేక పోవడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు షో లైవ్ స్ట్రీమింగ్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది. మొదట్లో రోజుకు రెండు ఎపిసోడ్స్ ఇచ్చారు. ఆ తర్వాత రోజులో ఒక్కటే ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయడం జరిగింది. అలా బిగ్ బాస్ నాన్ స్టాప్ రకరకాలుగా మారుతూ వచ్చింది. ఎట్టకేలకు షో పూర్తైంది. బిందు మాధవి మొదటి స్థానంలో నిలిచింది. అఖిల్ రన్నర్ గా నిలిచాడు.
తెలుగు బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ మొదటి సీజన్ పూర్తి అయ్యింది. మరి కొన్ని నెలల్లో రెగ్యులర్ టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ ఆరవ సీజన్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఆరో సీజన్ కు సంబంధించిన హింట్ ను నాగార్జున ఇవ్వడం జరిగింది. అది మరి ఎంతో దూరం లేదు.. ఆలస్యం లేదు అన్నట్లుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఓటీటీ బిగ్ బాస్ మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే డౌటే అన్నట్లుగా ఉంది పరిస్థితి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు మరియు షో నిర్వాహకులు భారీగా ఖర్చు చేయడం జరిగింది. అయితే రెగ్యులర్ బిగ్ బాస్ కు వచ్చిన స్థాయిలో హైప్ రాలేదు. ఆ విషయం ను ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. అందుకే ఓటీటీ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటిన్యూ అయ్యేనా అనేది చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ బిగ్ బాస్ తో పోల్చితే నాన్ స్టాప్ కు నాగార్జున హోస్టింగ్ చేసే విషయంలో ఆసక్తిగా ఉన్నాడా అనేది అనుమానం.
ఓటీటీ వర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ విషయంలో మొదట్లో ఉన్నంత ఆసక్తి తో నాగార్జున చివరి వరకు లేడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఈ విషయంలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేది తెలియదు కాని ఒకవేళ సీజన్ 2 కనుక మొదలైతే నాగర్జుననే షోను హోస్ట్ చేస్తారా అంటే లేదు అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఈ విషయంలో నాగ్ అభిప్రాయం ఏంటి అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.





Untitled Document
Advertisements