కాశ్మీర్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సామ్, రౌడీల ఖుషి

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 12:08 PM

 కాశ్మీర్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సామ్, రౌడీల ఖుషి

పెళ్ళిచూపులు సినిమాతో అందరి చూపులు తనవైపు తిప్పుకుని అర్జున్ రెడ్డి తో ఔరా అనిపించిన టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రొమాంటిక్ చిత్రాలతో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఎమోషనల్ లవ్ స్టోరీలతో మంచి గుర్తింపును అందుకున్న శివ నిర్వాణ డైరెక్షన్లో వస్తున్న ఖుషి చిత్రం పై కేవలం టైటిల్ తోనే అంచనాలను పెంచేశారు. ఇక ఈ చిత్రంలో రౌడీ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది మొదట్లోనే షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్నారు.
కానీ విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో బిజీగా ఉండటం వలన చాలా ఆలస్యంగా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇక మొదటి షెడ్యూల్ ను ఇటీవల మొదలు పెట్టారు. ఇక ఆ షెడ్యూల్ ను చాలా వేగంగా పూర్తి చేశారు. పర్ఫెక్ట్ రొమాంటిక్ స్క్రిప్ట్ తో రెడీ అయిన దర్శకుడు శివ నిర్వాణ ఈ మూవీ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను ఇటీవల కాశ్మీర్ లో మొదలుపెట్టారు. అనుకున్న సమయం కంటే ముందుగానే చాలా వేగంగా పూర్తి చేశారు. రియాలిటీకి చాలా దగ్గరగా ఉండాలి అని కాశ్మీర్లోని లోకల్ ప్లేస్ లలో అందమైన లొకేషన్స్ లో చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ను అనుకున్నట్లుగా చిత్రీకరించడం జరిగింది.
ఇక షూటింగ్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లైగర్ మూవీ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నప్పటికి కూడా మళ్లీ ఇలాంటి రొమాంటిక్ లవ్ చిత్రంతో వస్తున్నాడు అంటే అతను ఎంతో నమ్మకంగా ఉన్నాడో చెప్పవచ్చు.
ఇక తరువాత షెడ్యూల్ ను కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి అని ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ చిత్రంలోని రొమాంటిక్ సన్నివేశాలు కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని డైరెక్టర్ ముందుగానే తెలియజేశాడు.
ముఖ్యంగా సామ్ రౌడీల మధ్య లిప్ లాక్ సీన్ కూడా మూవీకి హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం సామ్, రౌడీలకు ఏ మాత్రం స్టార్ డమ్ ని దక్కిస్తుందో చూడాలి.





Untitled Document
Advertisements