సౌత్ఆఫ్రికాతో జరిగే టీ ట్వంటీ జట్టులో డీకే ..

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 12:36 PM

సౌత్ఆఫ్రికాతో జరిగే  టీ ట్వంటీ జట్టులో డీకే ..

దక్షిణ ఆఫ్రికా క్రికెట్ జట్టు భారత్ తో టీ ట్వంటీ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే అయితే జూన్ నెలలో దక్షిణ ఆఫ్రికా జట్టు పర్యటన సందర్బంగా భారత క్రికేట్ బోర్డు ట్వంటీ ట్వంటీ మరియు టెస్ట్ టీమ్ ల జట్లను ప్రకటించింది. అయితే భారత జట్టుకు అన్ని ఫార్మట్ లలో కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కు విశ్రాంతినిస్తూ కే ఎల్ రాహుల్ కు భాద్యతలను అప్పగించింది. అయితే ఈ సారి టీ ట్వంటీ జట్టులో భారీగానే మార్పులు జరిగాయి. ఈ సిరీస్ లకు సంబంధించి చేతన్ శర్మ ఆధ్వర్యంలోని కమిటీ నూతన ఆటగాళ్ళకు అవకాశం కల్పిస్తూ తుది జట్టును ప్రకటించడం జరిగింది. అయితే ఈ టీ ట్వంటీ జట్టులో చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరమైన దినేష్ కార్తిక్ కు చోటు దక్కడం జరిగింది. అయితే ఈసారి ఐపిఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ముందుకు తీసుకెళ్ళిన దినేష్ కార్తిక్ కు చోటు దక్కడం వల్ల తనని సపోర్ట్ చేసిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. మనోదైర్యం ఉంటె దేన్నైనా సాదించగలం అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసాడు డీకే. దినేష్ కార్తిక్ కు అందరు అభినందనలు తెలియజేస్తున్నారు. గతంలో బంగ్లాదేశ్ తో జరిగిన నిధాస్ ట్రోఫీలో డికే ఇన్నింగ్స్ ను ఎవరు మర్చిపోలేరు . ఇక ఇప్పుడు టీం ఇండియా కే ఎల్ రాహుల్ సారథ్యంలో దినేష్ కార్తిక్ మరియు ఉమ్రాన్ మాలిక్ వారికి చోటు కల్పిస్తూ ఇలా ఉంది .
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

https://twitter.com/DineshKarthik/status/1528402551309094912?s=20t=otmzAIx7d80a-ajnJyrPqg








Untitled Document
Advertisements