పవన్ - హరీష్ కాంబోలో వస్తున్న చిత్రం పాన్ ఇండియా కాదట!

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 03:39 PM

పవన్ - హరీష్ కాంబోలో వస్తున్న చిత్రం పాన్ ఇండియా కాదట!

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా శకం మొదలైంది. ఏ స్టార్ హీరోని కదిలించినా వినిపిస్తున్న మాట ఒక్కటే అదే పాన్ ఇండియా. స్టార్ హీరో నుంచి మీడియం రేంజ్ వరకు అంతా కూడా పాన్ ఇండియా సినిమాల పేరుతో హడావిడిగా కనిపిస్తున్నారు. రాబోయే రోజులలో మీడియం రేంజ్ హీరోల సినిమాలు కుడా పాన్ ఇండియా స్థాయిలో అంటే ఐదు భాషలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది యంగ్ హీరోలు మా సినిమా కుడా పాన్ ఇండియా సినిమానే అంటూ ప్రకటించారు. కానీ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం పాన్ ఇండియా మాట ఎత్తడం లేదు.
పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా తరువాత మాత్రం పవర్ స్టార్ నుంచి రానున్న మూవీ మాత్రం పాన్ ఇండియా కాదని తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని దర్శకుడే స్పష్టం చేయడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. అసలు విషయంలోకి వెళితే `భీమ్లానాయక్` తో ఆడియన్స్ ముందుకొచ్చారు పవన్.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపించింది. హిందీలోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నామంటూ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఆ తరువాత ఈ విష్యం గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత పవన్ కల్యాణ్ `హరి హర వీరమల్లు` సినిమా చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం చిత్రీకరణలో వుండగానే హరీష్ శంకర్ తో ఓ సినిమాకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
`భవదీయుడు భగత్ సింగ్` పేరుతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. గత కొంత కాలంగా సందిగ్ధంలో వున్న ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో వున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గరి నుంచి భారీ క్రేజ్ ఏర్పడింది.
అయితే ఈ చిత్రం యొక్క షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో స్పష్టత లేదు. తాజాగా దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని 80 శాతం చిత్రీకరణ హైదరాబాద్ లోనే జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈ చిత్రంలో పవన్ లెక్చరర్ గా కనిపిస్తారని సర్ ప్రైజింగ్ విషయాన్ని వెల్లడించిన హరీష్ శంకర్ ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రం కాదని చెప్పారు. దీంతో అభిమానులు ఇదేంటీ హరీష్ శంకర్ ఇలా చేస్తున్నాడని అవాక్కవుతున్నారట. ప్రతీ హీరో పాన్ ఇండియా అంటుంటే మాది పాన్ ఇండియా మూవీ కాదని హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వడం పవన్ అభిమానులని తీవ్ర నిరాశకు గురిచేస్తోందట. మరి `భవదీయుడు భగత్ సింగ్` సినిమా పవన్ కు ఏ మేరకు కలిసివస్తుందో వేచి చూడాలి.





Untitled Document
Advertisements