హీరోయిన్లు అవకాశాల కోసం పడుకుంటారు.. సీనియర్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 05:00 PM

హీరోయిన్లు అవకాశాల కోసం పడుకుంటారు.. సీనియర్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

బయట ప్రపంచానికి సినిమా అనేది ఓ అద్భుతం.. రంగుల ప్రపంచం. మరి ఈ రంగుల ప్రపంచంలో తెర పైన కనిపించే విషయాలకంటే.. తెర వెనుక జరిగేవే ఎక్కువని అంటుంటారు. సిని ఇండస్ట్రీ ఒక లోతైన సముద్రం వంటిది. లోపలికి మునగడమే తప్ప పైకి తేలడం ఉండదు. నిండా మునిగిన వాడికి చలేక్కడిది అన్నాట్టుగా ఒక్కసారి ఈ రంగుల ప్రపంచంలోకి అడుగు పెడితే అక్కడ నిలదొక్కుకోవాలి అంటే అన్ని వదులుకోవాల్సిందే. అదేవిధంగా ఇక్కడ చాలా విషయాలు గుర్తించబడవని చెప్పుకుంటుంటారు. ముఖ్యంగా మహిళలు ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ వంటివి ఎదుర్కొంటారని పలువురు అభిప్రాయ పడుతుంటారు.
గతంలో 'క్యాస్టింగ్ కౌచ్' 'మీటూ' ఉద్యమాలు సినిపరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ - వేధింపులు సర్వసాధారణమంటూ అనేక మంది హీరోయిన్లు తమ అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తపరిచారు. కొందరైతే ధైర్యంగా వాళ్ళ పేర్లను వెల్లడించి సంచలనం రేపారు. టాలీవుడ్ లో కూడా దీనిపై పెద్ద చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం పడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ ఉన్నట్లే.. హానీ ట్రాప్ కూడా ఉందని అన్నారు.
ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటని ప్రశ్నించగా.. ''ఏమీ తేడా లేదు. ఇండస్ట్రీలో అప్పుడూ అమ్మాయిలు పడుకునేవారు.. ఇప్పుడు కూడా పడుకుంటున్నారు. పడుకోవాలి. అప్పుడూ మోసం చేసేవాళ్ళు.. ఇప్పుడు కూడా చేస్తున్నారు. సినిమా చూసే జనాల యాటిట్యూడ్ మాత్రమే ఇక్కడ మారింది'' అని బోల్డ్ గా మాట్లాడారు గీతాకృష్ణ.
''నువ్వు కమిట్మెంట్ ఇచ్చి వచ్చావ్ అని అంటే ఏ హీరోయిన్ అయినా ఒప్పుకుంటుందా? ఎవరూ ఒప్పుకోరు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉంది.. ఉండబోతోంది.. రాబోయే రోజుల్లో ఇంకా బాగా పెరుగుతుంది'' అని అన్నారు. ''సెక్సువల్ కాంటాక్ట్ లో ఫేవర్ చేయడం అనేది అడ్వర్టైజింగ్ లో పుట్టింది. సౌత్ ఇండియాలో ఫస్ట్ క్యాస్టింగ్ కౌచ్ అనేది కోలీవుడ్ లో పుట్టింది. నాస్టీ ఫెలోస్ వాళ్ళు. కన్నడ వాళ్ళు ఇంకా డర్టీ ఫెలోస్'' అని దర్శకుడు అన్నారు.
''ఒక ఆడదాన్ని చూశారంటే 90 శాతం మగవాళ్ళు పడుకోవాలనే అనుకుంటారు. ఆడది కూడా హానీ ట్రాప్. వీళ్ళు కూడా సామాన్యమైన వాళ్ళు కాదు. వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది.. ఎలా వాడిని లొంగదీసుకుందాం.. ఎలా డబ్బులు గుంజుదాం అని ఆలోచిస్తుంటారు. దాన్నే హానీ ట్రాప్ అంటారు. వాళ్ళు కాస్టింగ్ కౌచ్ చేస్తే.. వీళ్ళు హానీ ట్రాప్ చేస్తారు. ఈ రెండూ ఎప్పుడూ ఉంటాయి'' అని గీతా కృష్ణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
''దర్శకుల్లోనే కాదు క్యాస్టింగ్ కౌచ్ అనేది సంగీత దర్శకుల్లో కూడా ఉంది. అందమైన సింగర్స్ తమతో పడుకోవాలని సంగీత దర్శకులు కోరుకుంటారు'' అని తెలిపారు. ''అలాంటివి ధైర్యంగా బయటపెడితే ఆ అమ్మాయి పరువే పోతుంది. తర్వాత ఎవరూ ఆఫర్స్ ఇవ్వరు. ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలే''
''నేను అందరినీ అనడం లేదు. అలాంటివి తన లైఫ్ లో వద్దు అనుకునే హీరో హీరోయిన్లు కూడా ఉంటారు. వాళ్ళు 10-15 శాతం ఉంటారు. అందుకే అందరినీ ఓకేలాగా చూడలేం. కానీ క్యాస్టింగ్ కౌచ్ ఉందా అంటే మాత్రం గతంలోనూ ఉంది.. ఇప్పుడు ఉంది.. భవిష్యత్ లో కూడా ఉంటుంది అని చెప్తాను'' అని సీనియర్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి చెబుతూ.. రేణూ దేశాయ్ చాలా పర్ఫెక్ట్ గర్ల్ అని గీతాకృష్ణ పేర్కొన్నారు. ''ప్రభుదేవా హీరోగా చేసిన 'టైమ్' సినిమాలో హీరోయిన్ కోసం ముంబైలో ఆడిషన్స్ చేసాం దానికి 20 మంది అమ్మాయిలను ఫోటోలు తీసాం. అయితే నేను రేణూ దేశాయ్ ఫోటోని ఎంపిక చేసాను. 'ఆ అమ్మాయి ఎందుకు? మీరు చెప్పిన మాట వినదు' అని కోఆర్డినేటర్స్ చెప్పారు. అలా ఎందుకు అన్నారో నాకు అసలు అర్థం కాలేదు''
''ఫోటో వెనకున్న నంబర్ తో రేణూ దేశాయ్ కి ఫోన్ చేస్తే హోటల్ కు వచ్చి కలిసింది. 'ఏంటి ఇక్కడ నీ గురించి ఇలా అంటున్నారు.. నీకేమైనా యటిట్యూడా?' అని అడిగాను. 'అదేం లేదండీ.. ఇక్కడ వీరంతా ఇలానే ఉంటారు. డర్టీ ఫెలోస్. నేను కమిట్మెంట్స్ కు దూరంగా ఉంటాను కాబట్టి.. నన్ను సపోర్ట్ చేయరు' అని చెప్పింది. వెంటనే నువ్వే నా మూవీలో హీరోయిన్ అన్నాను. చివరకు సిమ్రాన్ ను హీరోయిన్ గా తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా ఆరోజు రేణూ దేశాయ్ చెప్తే కానీ నాకు కమిట్మెంట్ అంటే ఏంటో తెలియలేదు. ఇది 1999లో జరిగిన విషయం'' అని గీతా కృష్ణ తెలిపారు.
కాగా సంకీర్తన - కీచురాళ్లు - కోకిల వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ గీతాకృష్ణ. అయితే ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపోయారు. ఈ సమయంలో అప్పటి విషయాల గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోలు మరియు వారి విగ్గులు.. హీరోయిన్ల సంబంధాలు.. హీరోహీరోయిన్ల క్యారెక్టర్లపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు.





Untitled Document
Advertisements