'శేఖర్' చిత్రప్రదర్శన నిలిపివేత పై స్టే ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.. రాజశేఖర్

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 07:05 AM

'శేఖర్'  చిత్రప్రదర్శన నిలిపివేత పై స్టే ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.. రాజశేఖర్

జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన 'శేఖర్' సినిమా ఇటీవల విడుదలైంది. అయితే, ఈ సినిమా డైరెక్టర్ జీవితరాజశేఖర్ తమ వద్ద అప్పు తీసుకున్నారని.. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడం లేదంటూ అప్పు ఇచ్చిన ఫైనాన్షియర్ కోర్టుకెక్కారు. దాంతో కోర్టు అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించేందుకు జీవితకు గడువు ఇచ్చింది. జీవిత నిర్దేశిత సమయంలో డబ్బు చెల్లించకపోవడంతో 'శేఖర్' సినిమా ప్రదర్శనలు ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఉత్తర్వులను కోర్టు కొట్టివేసిందని హీరో రాజశేఖర్ వెల్లడించారు. ఫైనాన్షియర్స్ జీవిత పై పెట్టింది తప్పుడు కేసు అని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని కోర్టు గుర్తించిందని, 'శేఖర్' సినిమాపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొట్టివేసిందని తెలిపారు.
ఏదేమైనా వీకెండ్ లో 'శేఖర్' సినిప్రదర్శనలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని రాజశేఖర్ వివరించారు. అయితే, శేఖర్ సినిమా ను ఆడియన్స్ కచ్చితంగా ఆదరిస్తారని తాను ముందే చెప్పానని తెలిపారు. భవిష్యత్ లో 'శేఖర్' సినిమా ప్రదర్శనపై ప్రోడ్యుసర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారికి మేము మద్దతుగా నిలుస్తామని రాజశేఖర్ వెల్లడించారు. తమ వెన్నంటే ఉన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వివరించారు.





Untitled Document
Advertisements