ఐపిఎల్ ప్లే ఆప్స్ నిబంధనలలో మార్పులు జరిగే ఛాన్స్ ..

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 01:35 PM

ఐపిఎల్ ప్లే ఆప్స్ నిబంధనలలో మార్పులు జరిగే ఛాన్స్ ..

ఐపిఎల్ 2022 సీజన్లో భాగంగా ఇప్పటికి గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జాయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆప్స్ కి చేరుకున్న సంగతి తెలిసిందే .. అయితే ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు ముగిసిపోగా .. నేటి నుంచి క్వాలిఫైయర్స్ మ్యాచ్ లు జరగనున్నాయి . అయితే నేడు మొదటి రెండు స్థానాలలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు మరియు రాజస్తాన్ రాయల్స్ జట్లు క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ ఆడనున్నాయి . అయితే ఈ మ్యాచ్ కి కోల్కత లో ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచినా జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచినా జట్టుతో క్వాలిఫైయర్ టూ లో తలపడుతుంది. అయితే కోల్కతలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోతే మ్యాచ్ రూల్స్ లో కొన్నిమార్పులను చేయనున్నట్లు సమాచారం . ఒకవేళ వర్షం కారణంగా ఆడించే పరిస్థితి లేకపోతే రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ పెట్టి విజేతను నిర్ణయించనున్నట్లు సమాచారం . ఒకవేళ సూపర్ ఓవర్ కు కూడా అవకాశం లేని పరిస్థితుల్లో.. రెండు జట్లలో ఒకదానిని లీగ్ దశలో చూపించిన ప్రతిభ ఆధారంగా ఫైనల్ కు పంపనున్నారు. ప్లే ఆఫ్స్ లో వాతావరణం అనుకూలించకపోతే 5 ఓవర్లకు తగ్గించి నిర్వహించొచ్చని నిబంధనలు చెబుతున్నాయి.





Untitled Document
Advertisements