బిత్తిరిసత్తి ప్రశ్నకు దాని గురించి ఇప్పుడే రివీల్ చేయదలచుకోలేదన్న అనిల్ రావిపూడి

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 08:28 AM

బిత్తిరిసత్తి  ప్రశ్నకు దాని గురించి ఇప్పుడే రివీల్ చేయదలచుకోలేదన్న అనిల్ రావిపూడి

యువ దర్శకుడు అనిల్ రావిపూడి పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదేవిధంగా అనిల్ రావిపూడికి కామెడీపై ఎంత పట్టు ఉందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన దర్శకత్వంలో రూపొందిన గత సినిమాలు చూస్తే ఈ విషయం ఎవరికైనా సులభంగా అర్థమైపోతుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన 'ఎఫ్ 3' చిత్రం ఈ నెల 27వ తేదీన భారీస్థాయిలో రీలీజ్ అవుతుంది. ఈ సినిమా రీలిజ్ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
తాజాగా ఈ చిత్ర బృందాన్ని బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు. సత్తి అడిగిన ఓ ప్రశ్నకి అనిల్ రావిపూడి స్పందిస్తూ .. " తమన్నా .. మెహ్రీన్ లాంటి బ్యూటీస్ ఉన్నప్పటికీ సోనాల్ ను ఎందుకు పెట్టామనే విషయం మాత్రం అడగొద్దు. ఆమె పాత్రకి సంబంధించినంతవరకూ ఒక సర్ ప్రైజ్ ఉంది. అందువలన ఆ విషయాలను రివీల్ చేయదలచుకోలేదు.
అలాగే పూజ హెగ్డే చేసిన సాంగ్ తప్పకుండా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. 'ఫలక్ నుమా ప్యాలెస్'లో ఎక్కువ రోజులు షూటింగు జరుపుకున్న చిత్రం మాదే. నేను ఈ సినిమాలోనూ చివర్లో కనిపిస్తాను. ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మేము ఆశించే రెస్పాన్స్ ఉంటే, 'ఎఫ్ 4' తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మెయిన్ లీడ్ రోల్స్ లోని నటినటులు వీరే ఉంటారు" అని చెప్పుకొచ్చాడు.





Untitled Document
Advertisements