పక్క రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 11:29 AM

పక్క రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

ఇటీవలే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మరియు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మధ్య జరిగిన వాదోపవాదనలు వల్ల తీన్మార్ మల్లన్న కు షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మంత్రి అజయ్ కుమార్ మళ్లీ ఇంకో కొత్త వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. ఈ సారి ఏకంగా పొరుగు రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో అడుగుపెట్టగానే అందరూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఇతర రాష్ట్రాలనేతలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పెట్టుబడులు కూడా రాబట్టలేక ఖాళీగా ఈగలు దోమలు తోలుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తెలంగాణ వస్తే చీకటి రాష్ట్రంగా ఏర్పడుతుందనే యాపిల్ చేసిన ఆ రాష్ట్రం కరెంట్ కోతలతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటువంటి సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.





Untitled Document
Advertisements