రాబోయే ఎన్నికలలో గుజరాత్ లో ఏకపక్షంగా ఎలక్షన్లు.. హార్దిక్ పటేల్

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 01:36 PM

రాబోయే ఎన్నికలలో గుజరాత్ లో ఏకపక్షంగా ఎలక్షన్లు.. హార్దిక్ పటేల్

గుజరాత్ లో పటిదార్ రిజర్వేషన్ ల ఉద్పయమకర్త హార్దిక్ పటేల్
ఇటివలే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. అయితే విలేకరులతో జరిగిన సమావేశం లో గుజరాత్ లో రాబోయే ఎన్నికలలో తాను కీలక పాత్ర పోషిస్తానని ఆయన వెల్లడించారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే మరి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి తనకి బీజేపి ఒక ఆప్షన్ మాత్రమేనని హార్దిక్ పటేల్ స్పష్టం చేసారు. తనకి పార్టీ తో సంబంధం లేకున్నా తన పాత్ర రాబోయే ఎన్నికలలో కీలకంగా ఉంటుందని తెలియపర్చారు. మరో వైపు కాంగ్రెస్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యహాలు ఎన్నికల కార్యాచరణ బాగుందని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. అయితే రాబోయే ఎన్నికలు మాత్రం భారతీయ జనతా పార్టీ కి అనుకూలంగా ఏకపక్షంగా కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఈ ఎన్నికలలో తను గతంలో ఎన్నికలలో కంటే చురుకుగా పాల్గొంటానని హార్దిక్ వెల్లడించారు. అయితే కాంగ్రేస్స్స్ కి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతాడు అనే దాని పై ఇంకా క్లారిటీ రాలేదు . తాజాగా ఈ విలేకరుల సమావేశం లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విధివిధానాలను ప్రశంశించిన ఈయన ఆప్ లో చేరడం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.





Untitled Document
Advertisements