తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఎందుకు చేయలేదు.. మంత్రి విశ్వరూప్

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 04:45 PM

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఎందుకు చేయలేదు.. మంత్రి విశ్వరూప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరియు జిల్లాల పేర్లు మార్చడం వల్ల కోనసీమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు . అయితే కొందరు వీరికి వ్యతిరేఖంగా మార్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరునే ఉంచాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలా జిల్లా పేరును మార్చడం వల్ల ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ మరియు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాలకు నిప్పు అంటించడం జరిగింది. అయితే మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ ఒకవేళ సమయానికి పోలీసులు గనక రాకపోయి ఉంటే తాను మరియు తన భార్య తన కుమారుడు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారని పోలీసులు మరియు తమ అనుచరులు రావడం వలన ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నమని పేర్కొన్నారు. ఒకవేళ వారు గనక రాకపోయి ఉంటే ఆ నిప్పులు సజీవదహనం అయ్యేవాళ్ళం అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేవలం వైసీపీ మంత్రి మరియు వైసీపీ ఎమ్మెల్యే ఇంటి పై దాడి చేసిన ఆందోళనకారులు పక్కనే ఉన్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఆనంద్ రావు ఇంటి పై ఎందుకు దాడి చేయలేదని కేవలం ఆ దాడికి పాల్పడిన వారిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఉన్నారని అందుకే తమ పార్టీ వారికి ఏం చేయకుండా కేవలం వైసీపీ నాయకుల పై దాడికి దిగారని మండిపడ్డారు. శాంతియుతంగా సాగుతున్న ఈ నిరసనలో సంఘ విద్రోహ శక్తులు రౌడీషీటర్లు పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి మండిపడ్డారు. ఈ ఇంటర్నెట్ సేవలను బంద్ చేయడం మరియు అమలాపురం వంటి పట్టణాలలో అన్ని సినిమా ఆటలను రద్దుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements