క్వాలిఫైయర్ టూ మ్యాచ్ కి బెంగళూరు జట్టు..

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 10:32 AM

క్వాలిఫైయర్ టూ మ్యాచ్ కి బెంగళూరు జట్టు..

ఐపీఎల్ 2022 ఈ సీజన్లో భాగంగా బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జాయింట్స్ జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్స్ కెప్టెన్ డూప్లిసిస్ డకౌట్ అవ్వగా విరాట్ కోహ్లీ 25 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ 9 పరుగులు చేసి అవుటయ్యాడు. లోమరర్ 14 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే తరువాత బ్యాటింగ్ కు వచ్చిన రజత్ పాటిదార్ ఏకంగా 112 పరుగులు 54 బంతుల్లోనే చేసీ జట్టును ముందుకు నడిపించారు అయితే ఆఖరి లో దినేష్ కార్తీక్ 23 బంతుల్లోనే 37 పరుగులతో రాణించాడు. అయితే బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ముగిసేసరికి 207 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్, కృనాల్ పాండ్య ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు. అయితే 208 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్నో జట్టుఓపెనర్ డీకాక్ 6 పరుగులకే పెవిలియన్ చేరగా కెప్టెన్ కేఎల్ రాహుల్ పూర్తి బాధ్యతయత టెన్నిస్ ఆడి 79 పరుగులు చేసాడు. కానీ మ్యాచ్లో మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరు నిలబడలేకపోవడంతో భారమంతా కె.ఎల్.రాహుల్ పైనే పడింది. ఒక దశలో దీప కూడా 45 పరుగులు చేసి కేఎల్ రాహుల్ కు సపోర్ట్ ఇచ్చాడు. ఆల్ రౌండర్ లు అయినా మార్కస్ స్టోయినిస్ 9 పరుగులు కృనాల్ పాండ్యా డక్ ఔట్ గా వెనుదిరగగా లక్నో జట్టుకు ఓటమి తప్పలేదు. బెంగళూరు బౌలర్లలో పేజీలు 3 వికెట్లు మహమ్మద్ సిరాజ్, హససరంగా , పటేల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ తో క్వాలిఫైర్ రెండు మ్యాచ్ ఆడనుంది.





Untitled Document
Advertisements