పాకిస్తాన్లో ఆకాశాన్ని అంటిన ఆందోళనలు

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 01:04 PM

పాకిస్తాన్లో ఆకాశాన్ని అంటిన ఆందోళనలు

దాయాది దేశం అయినా పాకిస్తాన్ లో ఆందోళనలు ఆకాశాన్ని అంటాయి. అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ ఈ సారి ఏకంగా దేశంలో ఎన్నికలు జరపాలి అని నినాదంతో నిరసనకు పిలుపు ఇవ్వగా శాంతియుతంగా చేపట్టాలని మొదటగా డిసైడ్ అయ్యారు. అయితే ఈ నిరసనలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు ఇస్లామాబాద్ కు నిరసన చేరుకోవడంతో అక్కడ ఆయన మద్దతుదారులు ఈ నిరసన కార్యక్రమంలో కొంత హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేయగా పోలీసులు ఈ నిరసనలను అడ్డుకోలేక పోయారు పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే భారీ బలగాలను మోహరించాలని పేర్కుంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి శాంతిభద్రతల దృష్ట్యా భారీ బలగాలను పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశించినట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.





Untitled Document
Advertisements