కోనసీమ అల్లర్లలో ప్రధాన నిందితుడిగా అన్యం సాయి అనే వ్యక్తి

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 03:08 PM

కోనసీమ అల్లర్లలో ప్రధాన నిందితుడిగా అన్యం సాయి అనే వ్యక్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరియు జిల్లాల పేర్లు మార్చడం వల్ల కోనసీమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు . అయితే కొందరు వీరికి వ్యతిరేఖంగా మార్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరునే ఉంచాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలా జిల్లా పేరును మార్చడం వల్ల ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ మరియు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాలకు నిప్పు అంటించడం జరిగింది. అయితే అమలాపురం వంటి ప్రాంతాలలో అల్లర్లు మరింత హింసాత్మకంగా మారింది పోయాయి అయితే ఈ అల్లర్లకు కారణం అన్యం సాయి అనే ఒక వ్యక్తి అని వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ అన్యం సాయి అనే వ్యక్తి అటు జనసేన నేతలతోనూ ఇటు వైసీపీ నేతలతో ఫోటోలు దిగడం వల్ల ఈ వర్గానికి చెందిన వాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు . అయితే ఈ అల్లర్లకు సంబంధించి ఎనిమిది వందల మందిని పోలీసులు విచారించగా 200 మంది నిందితులు విచారణలో తేలింది. అయితే వీరిని చట్ట వ్యతిరేకులుగా గుర్తించి వీరిపై శిక్షలు విధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు కోనసీమ మొత్తం పోలీసు బలగాలతో నిండిపోయి ఎక్కడ అల్లర్లు జరిగిన గట్టిగానే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.





Untitled Document
Advertisements