మతసామరస్యానికి వేదికగా కరీంనగర్..

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 06:13 PM

మతసామరస్యానికి వేదికగా  కరీంనగర్..

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం . అయితే ఇటీవల కాలంలో భారత దేశంలో హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు ఒకరిపై ఒకరికి దూషణలు అంతే కాక ప్రతీ అంశాన్ని రాజకీయ కోణం కూడా చూసి దానికి మతం రంగులు పులిమి రాజకీయ నాయకులు మతాలను రాజకీయాలకు వాడుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో భారత దేశంలో కొన్ని ఘటనలు మతాల మధ్య దూరాన్ని మరింతగా పెంచేశాయి. ఇటువంటి తరుణంలో పర మతాన్ని గౌరవించేట్లుగా ఒక సన్నివేశం ఎదురయ్యింది. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన హిందూ ఏక్తా యాత్రలో చోటు చేసుకుంది. అయితే ఈ యాత్ర ప్రారంభోత్సవ సమావేశంలో బండి సంజయ్ హిందూ ముస్లింలకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ నేపథ్యంలో కూడా యాత్రా సమయంలో కొందరు ముస్లిం వ్యక్తులు శ్రీరాముడి విగ్రహం పై పువ్వులు వేయడం పై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. దేశంలో మతమే కీలకమైన రోజుల్లో పర మతాన్ని గౌరవించే ఈ సంఘటన పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తులకు అభినందనలు తెలియజేస్తున్నారు.





Untitled Document
Advertisements