ఎందరో ప్రధానులు వచ్చారు పోయారు కానీ దేశ పరిస్థితి ఇలానే ఉంది.. కేసీఆర్

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 06:15 PM

ఎందరో ప్రధానులు వచ్చారు పోయారు కానీ దేశ పరిస్థితి ఇలానే ఉంది.. కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దేశ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు పలు రాష్ట్రాల ముఖ్య నేతలతో సమావేశం అవుతున్న విషయం తెలిసిందే అయితే అంతకుముందే ఆయన థర్డ్ ఫ్రంట్ తీసుకు వచ్చి దేశంలో కాంగ్రెస్ మరియు బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చేసిన ప్రణాళిక వికటించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియన్ బిజినెస్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అయితే ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ మరియు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో భాగంగా దేశంలో భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాక రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై కూడా వీరు మాట్లాడుకున్నట్లు సమాచారం వెల్లడయింది. అయితే అన్నింటికీ భిన్నంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ దేశానికి ఎందరో ప్రధానమంత్రి వచ్చారు పోయారు కానీ దేశ పరిస్థితి మాత్రం ఇలాగే ఉంది దీని మార్చాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉందని వెల్లడించారు. దేశంలో ఎంతో మంది నాయకులు ఉన్నా కూడా మీరు కరెంటు రోడ్లు వంటి సౌకర్యాల కోసం ఇంకా ఎదురు చూడాల్సి వస్తుందని రూపాయి విలువ పడిపోవడానికి కూడా కారణం ప్రధాన మంత్రులే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements