మధుమేహ వ్యాధి గ్రస్తులకు పైనాపిల్ మంచిదేనా?

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 12:02 PM

మధుమేహ వ్యాధి గ్రస్తులకు పైనాపిల్ మంచిదేనా?

పైనాపిల్ ఇది పైనంతా గరుకుగా ఉంటుంది. లోపల దీని గుజ్జు గట్టిగా ఉంటుంది. పైగా ఇది తినడానికి తియ్యతియ్యగా, పుల్లగా ఉంది నాలుక కోసుకుంటున్న ఫీలింగ్ ఉంటుంది. దీన్ని నేరుగా తినడం కన్నా జ్యూస్ రూపంలో తీసుకోవడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. దీనిలో 150 రకముల పోషక పదార్థాలు ఉన్నాయని పరిశోధనల ద్వారా తెలియజేశారు. పైనాపిల్ వాడటం వలన శరీరంలోని వ్యర్థాలు విసర్జించబడతాయి. కణాలను శక్తివంతం చేస్తుంది. పైనాపిల్ కు క్యాన్సర్ కణాలను తొలగించే గుణం ఉంది. అనేక విటమిన్లు సమ్మేళనం ఈ పైనాపిల్ లో అధికంగా ఉన్నాయి. ఏ,సి, ఈ, బి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, నియాసిన్, పోలిక్ ఆమ్లం, పెంటోథెనిక్ ఆమ్లం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, జింక్, కాపర్ లాంటి పలు ధాతువులు ఉన్నాయి. సూక్ష్మక్రిమి నాశన లక్షణాలు ఉన్నాయి. నొప్పిని తగ్గించే మూలకాలు, మూలికలు ఉన్నాయి. పైనాపిల్ తీసుకోవడం వలన సులభంగా నిద్ర పడుతుంది. అదేవిధంగా రక్త శుద్ధి జరుగుతుంది. పైనాపిల్ తీసుకోవడం వలన జ్ఞాపక శక్తి పెంచుతుంది. అంతేకాక కీళ్లవాతం, గుండె వ్యాధులు, మధుమేహం లాంటి వ్యాధులను నియంత్రిస్తుంది. దీనిలో లినోలిక్ యాసిడ్ ఉండటం వలన చర్మ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. రక్తంలోని కొవ్వును తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో బీటా కణాలను పునః నిర్మాణం చేయుట, మధుమేహం అదుపులో ఉంచడంలోనూ అత్యంత సహకారిగా ఉంటుంది. అయితే దీన్ని జ్యూస్ లా కాకుండా నేరుగా పీచుతోపాటు తినటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు 2, 3 ముక్కలు తినడం వలన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతుంది.





Untitled Document
Advertisements