మరోసారి భారత్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఇమ్రాన్ ఖాన్

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 01:31 PM

మరోసారి భారత్ పై  ప్రశంసల వర్షం కురిపించిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత దేశం పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మధ్య కాలంలోనే భారత విధివిధానాలపై అంతర్జాతీయ వ్యవహారాలపై భారత్ ను మరోసారి ప్రశంసించాడు. రష్యాతో అమెరికాకు ఉన్న వైఖరి కారణంగా కాదు క్వాడ్ కూటమిలో అమెరికాతో ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. దౌత్యసంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు రష్యా నుండి చమురును మరియు చమురు ఉత్పత్తులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తుందని ఇటీవలే పెట్రో ఉత్పత్తులపై ధరలను కూడా తగ్గించారని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు . అలాగే ఇదే సమయం అనుకోని పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించకుండా దాదాపు 30 రూపాయల వరకు పెంచిందని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన సమయంలోనే పెట్రో ధరలను తగ్గించేందుకు తాను రష్యాలో పర్యటించనున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటి ప్రభుత్వం అందుకు ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు.





Untitled Document
Advertisements