ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగం ఊడి పడిందంటు కేరళకు చెందిన వ్యక్తి పిర్యాదు !

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 02:21 PM

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగం ఊడి పడిందంటు కేరళకు చెందిన వ్యక్తి పిర్యాదు !

ప్రస్తుతం భారతదేశంలోని ముఖ్యపట్టణాలలో ఎలక్ట్రిక్ వాహనాల హావా నడుస్తుంది. ఒకవైపు వాతవరణ కాలుష్యం, మరొక వైపు పెరిగిన ఇంధనం ధరల నేపధ్యంలో దాదాపు పట్టణాలలోని ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందు భాగం ఊడి పడిపోయిందని కేరళకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తాను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఊడిపోయిన ముందు భాగం ఫోటోలను శ్రీనాథ్ మీనన్ అనే వ్యక్తి ట్విటర్‌లో షేరు చేశాడు. ఈ ప్రమాదకర ప్రొడక్టులను తయారు చేయడానికి ఓలా నాణ్యతలేమి మెటీరియల్స్ వాడిందని శ్రీనాథ్ మండిపడ్డాడు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌పై తీవ్ర ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. బ్యాటరీ సమస్యలతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలిపోతున్నాయని కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాక మరికొంత మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని సాఫ్ట్‌వేర్ లోపాలతో ప్రమాదాలు నెలకొంటున్నాయని ఆరోపిస్తున్నారు. తాజాగా ముందు భాగం కూడా ఊడిపోతున్నట్టు కస్టమర్లు పేర్కొంటున్నారు.
తాజాగా నెలకొన్న ఈ సమస్య అటు సాఫ్ట్‌వేర్ బగ్స్, ఇటు బ్యాటరీ లోపాలకు చెందినది కాదు. ఈ స్కూటర్ల ఫిజికల్ స్ట్రక్చర్‌లోనే ప్రమాదాలున్నాయని, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రమాదకరంగా కంపెనీ రూపొందిస్తుందని పేర్కొంటున్నారు. చాలా తక్కువ స్పీడ్‌లో నడుపుకుంటూ వెళ్తుండగానే ఇటువంటి సంఘటన జరిగిందని, ముందు భాగమంతా ఊడిపడిపోయిందని శ్రీనాథ్ మీనన్ చెప్పారు. ఈ నాణ్యతరహితమైన మెటీరియల్స్‌ను వాడకుండా ఉండేందుకు ఈ స్కూటర్ డిజైన్‌ను మార్చాలని, రీప్లేస్ చేయాలని శ్రీనాథ్ కోరాడు. తమ జీవితాలను ప్రమాదంలో పడకుండా కాపాడాలని ట్విటర్‌ వేదికగా శ్రీనాథ్ పేర్కొన్నాడు.





Untitled Document
Advertisements