వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్న తమన్.. కొత్త అవకాశాలను మిస్ అవుతున్నాయా?

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 02:51 PM

వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్న తమన్.. కొత్త అవకాశాలను మిస్ అవుతున్నాయా?

అగ్ర సంగీత దర్శకుల్లో మంచి ఫామ్ లో ఉన్న వ్యక్తి తమన్. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో నుంచి డీజే టిల్లు వరకు ఏ హీరోని కదిలించినా తమన్ పేరునే స్మరిస్తున్నారు. డబ్బింగ్ ఫిల్మ్ 'వైశాలి'తో తెలుగు నిర్మాతల దృష్టిని ఆకర్షించిన తమన్ ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ నటించిన 'కిక్' చిత్రంతో సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం తరువాత వరుస చిత్రాలతో దూసుకుపోతూ సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకుంటూ ఓ రేంజ్ కు చేరుకున్నాడు. స్టార్ హీరోల చిత్రాలకు స్వరాలు సమకూరుస్తూ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా తన పేరు వినిపించేలా చేసుకున్నాడు. అదేవిధంగా చిన్న సినిమాల నేపథ్య సంగీతం విషయంలోనూ ఎక్కువగా తమన్ పేరు వినిపిస్తుంది.
అంతలా ఏ చిన్న అవకాశాన్ని కూడా తమన్ వదలడం లేదు. తన వద్ద కు వచ్చి ప్రతీ చిత్రాన్ని అంగీకరిస్తూ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డౌరెక్టర్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. తనదైన వర్క్ స్టైల్ కమిట్ మెంట్ తో వర్క్ చేస్తూ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ నే వెనక్కి నెట్టేసి టాలీవుడ్ లో టాప్ సంగీత దర్శకుడిగా స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది తమన్ చేతిలో వున్నవన్నీ స్టార్స్ మూవీసే కావడం గమనార్హం.
తమన్ ఈ ఏడాది దాదాపు ఆరు చిత్రాలను ఒకే చేశాడు. అందులో ఇప్పటి వరకు రెండు సినిమాలు వరుణ్ తేజ్ నటించిన 'గని' సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట'సినిమాలు రిలీజ్ అయ్యాయి.
మరో నాలుగు సినిమాలు రిలీజ్ కావాల్సి వుంది. విశేషం ఏంటంటే ఇదే ఏడాది తమన్ చిరకాల కోరిక కూడా తీరబోతోంది. అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'బాయ్స్' చిత్రంతో నటుడిగా పరిచయమైన తమన్ ఈ ఏడాది అదే దర్శకుడు రామ్ చరణ్ తో చేస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఇది తమన్ కు గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. తమన్ కూడా ఇదే ఫీలవుతున్నాడట. ఇదిలా వుంటే వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నా తమన్ కొన్ని క్రేజీ ఆఫర్లని కోల్పోతున్నాడని తెలుస్తోంది. నేపథ్య సంగీతం నుంచి అగ్ర హీరోల చిత్రాలకు సంగీతం అందించే వరకు ప్రతీ అవకాశాన్ని వదలకుండా అంగీకరిస్తూ వస్తున్న తమన్ ని కొంత మంది కావాలనే వద్దనుకుంటున్నారట. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్న తమన్ ని తీసుకుంటే అనుకున్న ఔట్ పుట్ ని రాబట్టుకోలేం అని పక్కన పెట్టేస్తున్నారట.
బిజీగా వున్న తమన్ తో వర్క్ చేయించుకోవడం అంత ఈజీ కాదు. పైగా ఈ బిజీ షెడ్యూల్ లో మనం అనుకున్న ఔట్ పుట్ ని తమన్ అందించలేకపోవచ్చు. అలాంటప్పుడ అతన్ని తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని చాలా మంది డైరెక్టర్స్ లైట్ తీసుకుంటున్నారట. అదే సమయంలో వేరే భాషలకు చెందిన సంగీత దర్శకులను తీసుకుంటున్నారట. ఇది తమన్ కు బిగ్ లాస్ గా పరిణమిస్తోందని ఇండస్ట్రీ లోపల వినిపించే టాక్.







Untitled Document
Advertisements