నాకు మంత్రి పదవి వద్దు అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి కి లేఖ రాసిన అశోక్ చంద్నా

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 04:37 PM

నాకు మంత్రి పదవి వద్దు అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి కి లేఖ రాసిన అశోక్ చంద్నా

ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రభుత్వం ఏర్పడింది అంటే చాలు మంత్రి శాఖలకోసం ఎమ్మెల్యేలు కొట్టుకోవడం మొదలవుతుంది. అయితే ఇటీవలే రాజస్థాన్లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే బండి నియోజకవర్గానికి చెందిన అశోక్ చంద్నాకు క్రీడలు, యువజన వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, విపత్తు నిర్వహణ, సహాయ మంత్రి వంటి దాదాపు అన్ని మంత్రిత్వ శాఖలను కేటాయించడం జరిగింది. అయితే ఇలా తనకు అనేకమైన పదవులను కేటాయించడం వలన తనకు ఉన్న అధికారాలలో అందరూ జోక్యం చేసుకుంటున్నారు అని.. ఆయా శాఖల లో తనకు గుర్తింపు ఇవ్వడంలేదని పేర్కొంటూ ముఖ్యమంత్రికి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో మంత్రి తనకు అప్పజెప్పిన శాఖలను ప్రిన్సిపల్ సెక్రటరీ కుల్దీప్ రాంకాకే అన్ని శాఖలలో అనుభవం ఉన్న కారణంగా అతనికి ఈ బాధ్యతలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు మంత్రి లేఖను రాశారు అయితే ఇప్పుడు ఈ వ్యవహారం పట్ల రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్గాలలో భిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ నుండి ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.

Untitled Document
Advertisements