నందమూరి తారకరామారావు శతజయంతి నేడు.. నివాళులర్పించిన తారక్, కల్యాణ్‌రామ్

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 08:20 AM

నందమూరి తారకరామారావు శతజయంతి నేడు.. నివాళులర్పించిన తారక్, కల్యాణ్‌రామ్

దివంగత నందమూరి తారక రామారావు ఇటు రాజకీయాలలోనూ, అటు సిని ఇండస్ట్రీలోనూ ప్రజల హృదయాలలో చెరగని ముద్రను వేసుకున్నారు. మనసున్న మారాజుగా చెప్పుకునే రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. తెలుగు తమ్ములకు ఒక పార్టీ కావాలి అని ఎంతో పట్టుదలతో పార్టీని స్థాపించిన ప్రజలకు సేవ చేసిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారకరామారావు. నేడు ఈ మహానుభావుడి శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అలాగే, ఆయన ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జై ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
కాగా, ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్.. సదా మీ సేవలో.. అంటూ ఎన్టీఆర్ ఫొటోతో ట్వీట్ చేశారు. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసులో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపోతాతా.. అని రాసుకొచ్చారు.

Untitled Document
Advertisements