బరువు తగ్గాలి అనుకుంటున్నారా? అయితే కెఫిన్ కి దూరంగా ఉండాలట

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 08:25 AM

బరువు తగ్గాలి అనుకుంటున్నారా? అయితే కెఫిన్ కి దూరంగా ఉండాలట

క్రమతప్పిన జీవనశైలీ మారిన ఆహారపు అలవాట్లు వీటి కారణంగా వయసుతో సంబంధం లేకుండా దాదాపు ప్రతి ఒక్కరు అధికబరువుతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా పట్టణాల్లో నివసించే వారిని ఈ అధికబరువు సమస్య ఎక్కువగా వేధిస్తుంది. వేసుకునే దుస్తులు కాస్త బిగుథైతే చాలు ఈ కాలం అమ్మాయిలు తెగ ఆందోళన పడుతుంటారు. అప్పట్లో అలా ఉండేదాన్ని అంటూపాత ఫోటోలను తెగ చూసుకుని భాదపడుతూ ఆహారం తీసుకోవడం మానేస్తుంటారు. ఆహారం మానేసినా తమకు తోచిన పద్ధతిలో సన్నబడేందుకు ప్రయత్నిస్తారు. కానీ దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయింటాన్నారు నిపుణులు. నిజంగా మీరు బరువు తగ్గాలి అనుకుంటే ఈ క్రింది పద్దతులను ఫాలో అయిపోండి..
* ఆహారం మానేసినంత మాత్రాన బరువు తగ్గిపోతారు. శరీరానికి సరిపడా శక్తిని అందించే ఆహారం తీసుకోవాలి. మానేయడానికి బదులు ఇంట్లో చేసిన పదార్థాలకు ప్రాధాన్యత నివ్వండి నూనెలు, తీపి వస్తువులు పరిమితంగా తీసుకోవడం మొదలుపెట్టాలి.
* మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. రాత్రి సమయంలో చాలా మంది లేవలసి వస్తుందని నీళ్లు తాగడం మానేస్తారు. అలా చేయకుండా మధ్యలో లేచి నీళ్లు తాగాలి. అలానే కీరదోస, నిమ్మ ముక్కలు, పుదీనా వంటివి కలిపి నీళ్ళు తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అదనపు కొవ్వు కరిగించడంలోను ఈ నీళ్లు ఉపకరిస్తాయి.
* జిమ్ యోగా వంటివి చేయకపోయినా తప్పకుండా ఉదయపు నడక, ఈత, టెన్నిస్ ఆడటం వంటివి చేయాలి . ఈ కాలంలో బద్దకం ఉండొద్దు కాబట్టి త్వరగా మేలుకొనే ఈ వ్యాపకాలకు ప్రాధాన్యమిస్తే త్వరగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
* రాత్రిపూట తక్కువ ఆహారంతో సరిపెట్టడం మంచి పద్ధతే కానీ... మర్నాడు నీరసం రాకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. అందుకే పండ్లు, మజ్జిగ వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి.
* ఆలస్యంగా నిద్రపోవడం, తినడం వంటివి ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి జీవన శైలికి అలవాటు పడితే... క్రమంగా బరువు పెరిగి ఊబకాయు నికి దారి తీయవచ్చు. అందుకే ఎనిమిది గంటల లోపు తినేసి సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకుంటే బరువు సమస్య ఉండదు.
* టీ,కాఫీలకు బదులు గ్రీన్,వైట్,బ్లాక్ టీ వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. కెఫిన్  కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తుందని అందుకే కెఫిన్ కలిగివుండే కాఫీ. టీలకు దూరంగా ఉండాలి అని బ్రిటిష్ అసోసియేషన్ కు చెందిన నిపుణులు చెబుతున్నారు.

Untitled Document
Advertisements