క్రీడాకారులకు తక్షణ శక్తిని అందించే ప్రోటీన్ షేక్ ..

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 08:29 AM

 క్రీడాకారులకు తక్షణ శక్తిని అందించే ప్రోటీన్ షేక్ ..

వేరుశెనగలు లేదా పల్లిలు ఇవి ప్రతి వంటింట్లోనూ సాదారణంగా దొరికేవే. ధర తక్కువ పోషక విలువలు ఎక్కువ. పల్లిలను ప్రోటీన్ రిచ్ ఫుడ్ గా చెబుతుంటారు. మనం రోజు ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా పలిల్లకు స్థానం ఉంటుంది. ఇడ్లీ, దోశ, పూరీ, వడ, ఉతప్పం టిఫిన్ ఏదైనా సరే సైడ్ డిష్ గా పల్లి చట్ని ఉండాల్సిందే. చివరికి ఇంట్లో టిఫిన్ గా ఉప్మా ప్రిపేర్ చేసిన గుప్పెడు పల్లీలు వేయనిదే ఉప్మా మనకి రుచించదు. అదేవిధంగా సాయంత్రం వేళ స్నాక్స్ గా చేసుకునే మరమరాల వేపుడు, అటుకుల వేపుడు, కారాబుంది ఇలా ఏదైనా సరే క్రిస్పీ ఐటమ్ అంటే అందులో వేయించిన పల్లీలు కలపాల్సిందే. కొన్ని రకాల స్వీట్లను కూడా పల్లిలతో తయారుచేయడం మనకి తెలిసిందే. చివరికి వంట నూనెలు కూడా పల్లిలతో చేసినవి వాడుతుంటాం.
అయితే రోజంతా ఇంతగా మనం పల్లిలను తీసుకున్నా మన శరీరానికి ఎలాంటి హాని జరగదు పైగా పల్లీలు మనం శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. కారణం వేరుశెనగ దానికి సంబంధించిన ఉత్పత్తులలో కొలెస్ట్రాల్ వుండదు అని పరిశోధనలో తేలింది. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు పోలిక్ ఆసిడ్ ఇటువంటి వన్నీ పుష్కలంగా లభిస్తాయి. గుప్పెడు వేరుశెనగల వలన మనకు అవసరమైన విటమిన్ ఈ లో 25°/° లభిస్తుందట. రక్తంలో హానిచేసే కొలెస్ట్రాల్ ని, తగ్గించడానికి అవసరమైన మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, పోలి అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా వేరుశనగలో ఉన్నాయి.
అంతేకాక వ్యాయామాలు చేసేవారు, క్రీడాకారులు ప్రతి రోజు పల్లిలతో చేసిన ప్రోటీన్ షేక్ తాగితే వారికి తక్షణ శక్తి లభిస్తుందట. ఈ ప్రోటీన్ షేక్ ఎలా చేయాలి అంటే.. గుప్పెడు పల్లిలను రాత్రి పుట నీటిలో నానాబెట్టాలి. రాత్రి నానాబెట్టిన పల్లిలను ఉదయం ఒకమిక్సి జార్ తీసుకుని అందులో వేయాలి అలాగే రెండు అరటిపండ్లను తొక్కతీసి ముక్కలుగా చేసి పల్లిలలో వేయాలి. ఇప్పుడు మీకు పాలు తాగాడం అలవాటు ఉంటె కనుక పాలను లేదంటే నీళ్ళను కొద్దికొద్దిగా పోస్తుంది స్మూత్ పేస్ట్ అయ్యేవరకు గ్రైండ్ చేసుకుని ఆ తరువాత దాన్ని గ్లాస్ లో పోసుకుని అలాగే తాగేయవచ్చు. అలా తాగలేము అనుకుంటే కొద్దిగా తేనే కూడా కలుపు కుని తీసుకోవచ్చు. ఈ ప్రోటీన్ షేక్ ని క్రీడాకారులే కాకుండా బరువు తగ్గాలి అనుకునే వారు ఉదయం బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది.

Untitled Document
Advertisements