బెంగళూరు ఇంటికి రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కీ..

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 10:37 AM

బెంగళూరు ఇంటికి రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కీ..

ఐపీఎల్ సీజన్ 2022 లో భాగంగా శుక్రవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ కిమధ్య క్వాలిఫై రెండు మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రాయల్ గా గెలుచుకొని ఫైనల్కు చేరుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని రెండు ఓవర్లు ఉండగానే ముగించేసి ఆహా అనిపించింది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన రాయల్ చాలెంజర్స్ జట్టు బ్యాటర్ లలో రజాత్ పాటీదార్ (58) అర్ధ సెంచరీతో రాణించగా ఎవరు లేక పోవడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 157 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఆ జట్టుకు కీలక బ్యాట్స్మెన్స్ అయినా విరాట్ కోహ్లీ 7 సెప్టెంబర్ 25 లోమ్రార్ 8 దినేష్ కార్తీక్ 6 మ్యాక్స్ వెల్ 24 పరుగులు మాత్రమే చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ మరియు మెకాయ్ మూడు వికెట్లు తీసుకుని బెంగళూరు జట్టును కుప్పకూల్చేశారు. రవిచంద్రన్ అశ్విన్ మరియు బౌల్ట్ కు తలో వికెట్ దక్కింది. రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుఓపెనర్ జట్టుకు శుభరంభాన్ని అందించాడు. యశస్వి జైస్వాల్ 21 పరుగులు చేయగా, మరొక ఓపెనర్ జాస్ బట్లర్ చివరి వరకు పోరాడి శతకం పూర్తి చేసుకొని జట్టుకు విజయాన్ని అందించాడు. యశస్వి జైస్వాల్ పెవిలియన్ చేరిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 23 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే జాస్ బట్లర్ 106 పరుగుల ను కేవలం 60 బంతుల్లోనే పూర్తి చేసుకుని నాటౌట్గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్కు చేరగా బెంగళూరు జట్టు ఐపీఎల్ సీజన్ నుండి నిష్క్రమించింది.

Untitled Document
Advertisements