సాహిత్యంలో భారతీయ నవలకు బుకర్ ప్రైజ్..

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 11:32 AM

సాహిత్యంలో భారతీయ నవలకు బుకర్ ప్రైజ్..

సాహిత్యంలో ఎంతో ప్రతిష్ఠాత్మక అవార్డు అయినా "బుకర్ ప్రైజ్ ను" భారతీయ రచయిత్రి సొంతం చేసుకుంది. అయితే గీతాంజలి రాసిన " రేతి సమాధి " హిందీ నవలకు ఈ పురస్కారం లభించింది. అయితే ఈ నవలను "టూంబ్ ఆఫ్ శాండ్ " అనే టైటిల్ తో అనువాదం చేసిన ఇంగ్లీషు నవల కూడా బుకర్ ప్రైజ్ రావడం గమనార్హం. అయితే భారతీయ భాషల్లో రాసిన పుస్తకానికి బుకర్ ప్రైజ్ లభించిన మొదటి నవలగా "రేతి సమాధి" నవల రికార్డు సొంతం చేసుకుంది. అయితే గీతాంజలి రాసిన ఈ నవలను అనే బ్రిటిష్ రచయిత్రి ఆంగ్లంలోకి అనువదిం చగా ఈ రెండింటికీ కలిపి పురస్కారం లభించింది. గురువారం జరిగిన బుకర్ ప్రైజ్ వేడుకలలో బ్రిటిష్ రచయిత డైసీ తో కలిసి గీతాంజలి ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఈ అవార్డును అందుకున్న గీతాంజలి ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు తన నవలకు ఇంత అభిమానం లభించి ఇంత మంచి ప్రైజ్ వస్తుందని అనుకోలేదని దీనిని గొప్ప గౌరవ సూచకంగా భావిస్తారు అని ఆమె చెప్పారు . అయితే మీ బుకర్ ప్రైజ్ కింద వచ్చే 50 పౌండ్ల నగదును ఇద్దరు చెరిసగం పంచుకోవడం జరిగింది.





Untitled Document
Advertisements