అన్న గారి శత జయంతి సందర్భంగా పలువురు ప్రముఖుల నివాళులు..

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 12:54 PM

అన్న గారి శత జయంతి సందర్భంగా పలువురు ప్రముఖుల నివాళులు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన గురించి తెలుగు భాషకు ఆయన చేసిన కృషి గురించి ఆయనను తలుచుకుని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మాట్లాడుతూ.. వెండితెర మీద నవరసాలు పండించిన మహనీయుడు తెలుగు జాతి గర్వించదగ్గ మహాత్ముడు అంటూ ఆయన శతజయంతి సందర్భంగా అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. మరో వైపు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే మహానటుడు, మహా నాయకుడు అని క్షేత్రస్థాయిలో, అంత్యోదయ మార్గంలో ఎన్టీఆర్ పరిపాలన సాగిందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిలిచిన ఆయన పాలన ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించి నివాళులు అర్పించారు. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు అన్న గారి పై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ తనకు మొదటిసారిగా దర్శకుడి అవకాశం వచ్చి తను ఈ స్థాయికి రావడానికి కారణం అన్న గారినేనని కీర్తిస్తూ ఆయన జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.





Untitled Document
Advertisements