నారా లోకేష్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కూతురు కైవల్య రెడ్డి

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 03:48 PM

నారా లోకేష్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కూతురు కైవల్య రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి గట్టి షాక్ ఎదురయ్యింది. ప్రస్తుతం వైసిపి పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్నా ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ తో సమావేశం అయ్యారు. దీంతో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం వెల్లువెత్తింది. అయితే ఈ సమావేశం అనంతరం అధికార వైసిపి పార్టీకి పెద్ద షాక్ తగిలింది అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో కీలక పదవులలో బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాక వైయస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య మరియు కిరణ్ కూమార్ రెడ్డి వంటి వారి పాలనా సమయంలో కూడా వివిధ పదవులను అనుభవించారు. అయితే నెల్లూరు లోని ఆత్మకూరులో ఆనం నారాయణ రెడ్డి కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు పార్టీలో ఉన్నారు అంటే నామమాత్రంగానే ఉన్నారు అని తెలుస్తుంది కావున రాబోయే ఎన్నికలలో ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్య రెడ్డి ఆత్మకూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కోసం నారా లోకేష్ ను కలిసినట్లు గా తెలుస్తుంది.

Untitled Document
Advertisements