దేశానికే అంబేద్కర్ పేరు పెట్టాలని సూచించిన ఆర్ నారాయణ మూర్తి..

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 04:48 PM

దేశానికే అంబేద్కర్ పేరు పెట్టాలని సూచించిన ఆర్ నారాయణ మూర్తి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరియు జిల్లాల పేర్లు మార్చడం వల్ల కోనసీమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు . అయితే కొందరు వీరికి వ్యతిరేఖంగా మార్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరునే ఉంచాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలా జిల్లా పేరును మార్చడం వల్ల ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ మరియు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాలకు నిప్పు అంటించడం జరిగింది. అయితే అమలాపురం వంటి ప్రాంతాలలో అల్లర్లు మరింత హింసాత్మకంగా మారింది . అయితే పీపుల్స్ ఆర్ నారాయణమూర్తి ఈ అంశంపై స్పందిస్తూ.. ఒక్క జిల్లాకు మాత్రమే కాదు దేశానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కోనసీమకు జిల్లాకు మహనీయుడు అంబేడ్కర్ పేరు పెట్టడం శుభపరిణామం అంటూ దేశానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని సూచించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే ఆర్ నారాయణ మూర్తి ఈసారి ఈ సరికొత్త అంశం తో మన ముందుకు వచ్చారు.





Untitled Document
Advertisements