ఓం ప్రకాష్ చౌతాలా కేసును ప్రస్తావిస్తూ చంద్రబాబునాయుడికి విజయసాయిరెడ్డి చురకలు

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 04:55 PM

ఓం ప్రకాష్ చౌతాలా కేసును ప్రస్తావిస్తూ చంద్రబాబునాయుడికి విజయసాయిరెడ్డి చురకలు

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాకు మరోసారి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అంతేకాక 50 లక్షల జరిమానా కూడా విధించింది. గతంలో హర్యానాలో అనర్హత గల వ్యక్తులను ఉపాధ్యాయులుగా నియమించారని కేసులో నిజా నిజాలు వెళ్లడం వల్ల ఈయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈయన చర్చ పూర్తి చేసుకుని ఏడాది గడిచినా సమయంలో ఆయనకు మళ్లీ చుక్కెదురైంది. ఆయన సంపాదనకు మించిన ఆస్తులు ఉన్నాయని అంశంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయగా ఆయనకు మళ్లీ నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ 50 లక్షల జరిమానా ఢిల్లీ కోర్ట్ విధించింది. అయితే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపించారు. కేవ‌లం రూ.6 కోట్ల ఆస్తుల‌కు లెక్క‌లు చూప‌ని కారణంగానే చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష ప‌డింద‌ని గుర్తు చేసిన సాయిరెడ్డి... ఇలాంటి ఆరోప‌ణ‌ల‌తోనే చంద్ర‌బాబుపై ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి 2005లో ఓ కేసు వేశార‌ని తెలిపారు. అయితే ఈ కేసు విచార‌ణ‌ను 17 ఏళ్లుగా స్టేల‌తో 'నిప్పు'నాయుడు అడ్డుకుంటున్నారంటూ ట్విట్టర్ వేదికగా విమ‌ర్శ‌లు కురిపించారు .





Untitled Document
Advertisements