ఆరోగ్య సమస్య వల్ల ఇంకా ఆసుపత్రిలోనే ఉన్న సోనియా గాంధీ

     Written by : smtv Desk | Fri, Jun 17, 2022, 12:24 PM

ఆరోగ్య సమస్య వల్ల ఇంకా ఆసుపత్రిలోనే ఉన్న సోనియా గాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ తాజా సమాచారం విడుదల చేసింది. కరోనా అనంతర సమస్యలతో సోనియా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముక్కు నుంచి రక్త శ్రావం జరగడంతో ఈ నెల 12వ తేదీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో సోనియా చేరారని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ తెలిపింది. వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స చేశారని చెప్పింది. గురువారం ఉదయం మరోసారి ఆమెకు పరీక్షలు నిర్వహించారని తెలిపింది.

ఈ సమయంలో సోనియా శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారని, దానితో పాటు కరోనా తర్వాతి సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది. సోనియా ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతోందని విషయం తెలిసింది . ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి (సమాచారం) జైరాం రమేశ్ లేఖని విడుదల చేశారు.





Untitled Document
Advertisements